Indian Railways: రైల్వే ప్రయాణికులకు 'గివ్ ఇట్ అప్' స్కీమ్... ఎందుకో తెలుసా?

Indian Railways | భారతీయ రైల్వే 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో ఉన్న కీలక ప్రతిపాదనల్లో 'గివ్ ఇట్ అప్' స్కీమ్ కూడా ఒకటి.

news18-telugu
Updated: June 20, 2019, 12:47 PM IST
Indian Railways: రైల్వే ప్రయాణికులకు 'గివ్ ఇట్ అప్' స్కీమ్... ఎందుకో తెలుసా?
Indian Railways: రైల్వే ప్రయాణికులకు 'గివ్ ఇట్ అప్' స్కీమ్... ఎందుకో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వే ప్రయాణికులకు టికెట్ ధరలో సబ్సిడీ ఇస్తుంటుంది. ఆ కన్సెషన్ ఏకంగా 100% వరకు ఉంటుంది. అంటే టికెట్ తీసుకోకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇస్తుందన్నమాట. కన్సెషన్ పొందని ప్రయాణికులు కూడా రైల్వేకు అయ్యే ఖర్చులో చెల్లిస్తున్నది ఎంతో తెలుసా? సగం మాత్రమే. అంటే మీ టికెట్ ఖర్చు రూ.500 అయితే రైల్వేకు అయ్యే ఖర్చు రూ.1,000 వరకు ఉంటుందని అంచనా. మిగతాదంతా ప్రజాధనమే. అంటే ప్రజలు చెల్లించే పన్నులే. వివిధ వర్గాలకు చెందిన ప్రయాణికులకు రైల్వే ఏటా ఇస్తున్న సబ్సిడీ సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇదంతా రైల్వేకు భారమే. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు భారతీయ రైల్వే సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. అదే 'గివ్ ఇట్ అప్' స్కీమ్.

భారతీయ రైల్వే 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో ఉన్న కీలక ప్రతిపాదనల్లో 'గివ్ ఇట్ అప్' స్కీమ్ కూడా ఒకటి. అంటే సబ్సిడీని ప్రయాణికులు స్వచ్ఛందంగా వదులుకునే స్కీమ్ ఇది. 2016లో ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రైల్వే ప్రతిపాదించిన 'గివ్ ఇట్ అప్' స్కీమ్ కూడా అలాంటిదే. సబ్సిడీ వర్తించే ప్రయాణికులు దూర ప్రాంతాలకు టికెట్లు బుక్ చేస్తే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి సబ్సిడీతో బుక్ చేయడం, రెండోది సబ్సిడీ లేకుండా బుక్ చేయడం. సబ్సిడీని వదులుకునేవాళ్లు టికెట్ ఛార్జీ కాస్త ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. మరి 'గివ్ ఇట్ అప్' స్కీమ్ ఎంచుకొని ఎంతమంది ప్రయాణికులు సబ్సిడీని వదులుకుంటారో చూడాలి.

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్




ఇవి కూడా చదవండి:

IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి 3 సౌతిండియా టూర్ ప్యాకేజీలు
Loading...
IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...