Railways: ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి రైళ్లు నడిపే బాధ్యతలు

Indian Railways | పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనుంది రైల్వే. రైలును ఏడాదికి లీజ్‌కు ఇచ్చే ఆలోచనలో ఉంది భారతీయ రైల్వే.

news18-telugu
Updated: June 19, 2019, 3:08 PM IST
Railways: ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి రైళ్లు నడిపే బాధ్యతలు
Railways: ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి రైళ్లు నడిపే బాధ్యతలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వే... ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ప్రజా రవాణా సంస్థ. ఇప్పుడు ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. త్వరలో రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడిపేలా భారతీయ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు టూరిస్ట్ రూట్లల్లో ప్రైవేట్ సంస్థలు ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తోంది. మరో 100 రోజుల్లో ప్రైవేట్ సంస్థలకు వేలం నిర్వహించనుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట రెండు రైళ్లను ఐఆర్‌సీటీసీకి అప్పగించనుంది భారతీయ రైల్వే. టికెట్ల జారీ, రైళ్లల్లో ఇతర సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. అందుకు బదులుగా రైల్వేకు ఒకేసారి కొంత మొత్తం డబ్బు సమకూరుతుంది. అయితే రద్దీలేని, టూరిస్ట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ రైళ్లను నడిపే వీలుంది. ఈ రూట్లను కూడా రైల్వేనే ఎంపిక చేయనుంది.

పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనుంది రైల్వే. రైలును ఏడాదికి లీజ్‌కు ఇచ్చే ఆలోచనలో ఉంది భారతీయ రైల్వే. ప్రముఖ పట్టణాలకు పగలు, రాత్రి ప్యాసింజర్ రైళ్లను నడిపే బాధ్యతల్ని అప్పగిస్తుంది. అయితే ఒప్పందం చేసుకునే ముందే కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది రైల్వే. ఆ తర్వాతే ప్రైవేట్ ఆపరేటర్లకు ఆహ్వానం పలుకుతుంది. అంతే కాదు రైల్వే కోచ్‌ల తయారీ యూనిట్లను కార్పొరేటీకరణ చేసే దిశగా భారతీయ రైల్వే అడుగులు వేస్తోంది. ప్రభుత్వానికి చెందిన కొత్త సంస్థ 'ఇండియన్ రైల్వేస్ రోలింగ్ స్టాక్ కంపెనీ'లో ఉత్పత్తి పరిశ్రమలు, అనుబంధంగా ఉండే వర్క్‌షాప్స్‌ భాగం కానున్నాయి.

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్




ఇవి కూడా చదవండి:

IRCTC: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి 3 సౌతిండియా టూర్ ప్యాకేజీలు
Loading...
IRCTC: ఐఆర్‌సీటీసీ టీడీఆర్... ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అంశాలివే
First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...