హోమ్ /వార్తలు /బిజినెస్ /

Railway: రైలు ప్రయాణికులకు షాక్... ఈ ఛార్జీలు కూడా చెల్లించాల్సిందే

Railway: రైలు ప్రయాణికులకు షాక్... ఈ ఛార్జీలు కూడా చెల్లించాల్సిందే

విజయవాడ ప్రజలకు శుభవార్త... మరో 24 రైళ్లు, పూర్తి వివరాలు

విజయవాడ ప్రజలకు శుభవార్త... మరో 24 రైళ్లు, పూర్తి వివరాలు

Indian Railways | త్వరలో మీ రైలు ప్రయాణం కాస్త భారం కానుంది. ఇప్పుడు చెల్లిస్తున్న ఛార్జీల కన్నా ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు. ఎందుకో తెలుసుకోండి.

  రైలు ప్రయాణికులకు త్వరలో షాక్ తగలనుంది. కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఎయిర్‌పోర్టులో వసూలు చేసినట్టు ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు-UDF చెల్లించాల్సి వస్తుందన్న వార్తలొస్తున్నాయి. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది భారతీయ రైల్వే. ఆ రైల్వే స్టేషన్లలోకి ఎంటరైతే ఈ ఛార్జీలు చెల్లించక తప్పదు. అయితే ఎంత ఛార్జీలు వసూలు చేస్తారన్న స్పష్టత లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతీయ రైల్వే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అయితే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఆధునిక సదుపాయాలు కల్పిస్తే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తుంది రైల్వే.

  Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

  OnePlus: వన్‌ప్లస్ మరో సంచలనం... తక్కువ బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్స్

  పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‍షిప్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనుంది రైల్వే. బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలు ఈ పనులను చేజిక్కించుకుంటారు. ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించి కమర్షియల్ కాంప్లెక్సులు, యూజర్ ఫీజుల ద్వారా లాభాలు పొందుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ముంబై, జైపూర్, హబీబ్‌గంజ్, చండీగఢ్, నాగ్‌పూర్, ఆనంద్ విహార్, బిజ్వాసన్ రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఇప్పటికే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ-PPPAC ఆమోదించిన తర్వాత ముంబై సీఎస్‌టీ రైల్వే స్టేషన్ ఆధునీకరించేందుకు బిడ్డింగ్ ప్రాసెస్ మొదలైంది.

  Govt Scheme: జాబ్ పోయిందా? అయినా సగం జీతం తీసుకోవచ్చు... అప్లై చేయండిలా

  LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందండి ఇలా

  రైల్వే స్టేషన్లను ఆధునీకరణ పనులు పూర్తైన తర్వాత ప్రయాణికుల నుంచి యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తుంది రైల్వే. ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు అందులో యూడీఎఫ్ పేరుతో ఛార్జీలు ఉంటాయి. అంటే మీరు ఏ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే ఆ ఎయిర్‌పోర్టుకు చెల్లించే ఫీజు అది. ఈ ఛార్జీలు వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో వేర్వేరుగా ఉంటాయి. సరిగ్గా అలాగే ప్రైవేట్ సంస్థలు ఆధునీకరించే రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుల్ని రైలు ప్రయాణికులు చెల్లించక తప్పదు. మీరు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఈ ఛార్జీలు టికెట్‌లో కలిపి వసూలు చేస్తారు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways, Train, Train tickets

  ఉత్తమ కథలు