భారతీయ రైల్వే ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేట్ రైళ్లను నడిపే బాధ్యతను ఐఆర్సీటీసీకి అప్పగించింది రైల్వే. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో మరో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దశలవారీగా ఈ ప్రైవేట్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి దశలో 2023 నాటికి 12 ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇలా 2027 నాటికి మొత్తం 151 ప్రైవేట్ రైలు సర్వీసుల్ని దశలవారీగా అందించాలన్న రైల్వే ప్రణాళిక. దేశంలోని 109 రూట్లల్లో ఈ 151 ప్రైవేట్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. మొత్తం రూ.30,000 కోట్ల ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని అంచనా.
SBI Balance Check: మీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా
SBI: రాత్రి వేళ ఏటీఎంకు వెళ్తున్నారా? ఓటీపీతో డబ్బులు డ్రా చేయండి ఇలా
భారతీయ రైల్వే ప్రణాళిక ప్రకారం 2022-23 లో 12 రైళ్లు, 2023-2024 లో 45 రైళ్లు, 2025-26 లో 50 రైళ్లు, 2026-27 లో 44 ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని నడిపేందుకు ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రపోజల్స్‌ను ఆహ్వానించింది రైల్వే. నవంబర్ నాటికి వీటిని ఫైనలైజ్ చేస్తారు. టెండర్లను 2021 మార్చి నాటికి పూర్తి చేస్తే 2023 మార్చి నాటికి ప్రైవేట్ రైళ్లు ప్రారంభమౌతాయని అంచనా. రైళ్లను ఆపరేట్ చేసే ప్రైవేట్ సంస్థలు ఫిక్స్డ్ ఛార్జీలు, ఎనర్జీ ఛార్జీలు, గ్రాస్ రెవెన్యూలో వాటాలను రైల్వేకు చెల్లిస్తాయి. ఒకవేళ ప్రైవేట్ సంస్థలు రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా ప్రైవేట్ రైళ్లను నడపకపోతే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
Pension Scheme: రోజూ రూ.10 పొదుపుతో నెలకు రూ.5,000 పెన్షన్... ఈ స్కీమ్‌లో చేరండిలా
WhatsApp: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపండి ఇలా
70 శాతం ప్రైవేట్ రైళ్లు భారతదేశంలోనే తయారవుతాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీని వల్ల ప్రయాణ సమయం 30 శాతం తగ్గుతుంది. అదే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ప్రయాణ సమయం 10-15 శాతం తగ్గుతుంది. భారతీయ రైల్వే ఇప్పటికే నడుపుతున్న రైళ్లతో పోలిస్తే ఈ ప్రైవేట్ రైళ్లు ఇంకా వేగంగా ప్రయాణిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:July 20, 2020, 12:38 IST