Indian Railways: ప్రధాన రైల్వే స్టేషన్లపై 100 అడుగుల జాతీయ జెండా

Indian Railways | త్వరలో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లపై 100 అడుగుల జాతీయ జెండాలు కనిపించనున్నాయి. రైల్వే ప్రయాణికుల్లో జాతీయత, దేశభక్తిని పెంచేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీ జెండాలను ఏర్పాటు చేయాలని జోనల్ రైల్వేలను ఆదేశించింది ఇండియన్ రైల్వే.

news18-telugu
Updated: September 5, 2019, 3:24 PM IST
Indian Railways: ప్రధాన రైల్వే స్టేషన్లపై 100 అడుగుల జాతీయ జెండా
Indian Railways: ప్రధాన రైల్వే స్టేషన్లపై 100 అడుగుల జాతీయ జెండా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 5, 2019, 3:24 PM IST
భారతదేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో, హైటెక్ సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది భారతీయ రైల్వే. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు, రైల్వే స్టేషన్‌ను రూపు రేఖల్ని మార్చేస్తోంది. హైటెక్ హంగులతో రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా... రైల్వే స్టేషన్ల పైన భారీ జాతీయ జెండాలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని 75 రద్దీ రైల్వే స్టేషన్లలో 100 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాలు కనిపిస్తాయి. సికింద్రాబాద్, కాచిగూడ, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్, దాదర్, థానె, కళ్యాణ్, ముంబై సెంట్రల్ లాంటి రైల్వే స్టేషన్లలో జాతీయ జెండాలు ఉన్నాయి.

త్వరలో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లపైన లేదా స్టేషన్ ఆవరణలో 100 అడుగుల జాతీయ జెండాలు కనిపించనున్నాయి. రైల్వే ప్రయాణికుల్లో జాతీయత, దేశభక్తిని పెంచేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీ జెండాలను ఏర్పాటు చేయాలని జోనల్ రైల్వేలను ఆదేశించింది ఇండియన్ రైల్వే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే-NFR జోన్‌లోని 38 ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీ జెండాలను ఏర్పాటు చేయబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటి ఏర్పాటు పూర్తి కానుంది. జిల్లా హెడ్‌క్వార్టర్లు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేయనుంది.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

IRCTC Tejas Express: తొలి ప్రైవేట్ రైలులో ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?

Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
Loading...
PF Balance: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఎంత జమైందో తెలుసా? ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవండి
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...