భారతదేశంలో సరకు, ప్రజా రవాణా విషయంలో రైళ్లు (Trains) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రైన్ వ్యవస్థ లేకపోతే చాలా వ్యాపారాలు స్తంభించిపోతాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని లాంగెస్ట్ రైల్వే నెట్‌వర్క్ లో ఒకటిగా మన ఇండియన్ రైల్వేస్ (Indian Railways) పేరు తెచ్చుకుంది. అయితే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వేస్ సేవలు ప్రారంభమై రేపటికి 170 సంవత్సరాలు పూర్తి కానుంది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సరిగ్గా 170 ఏళ్ల క్రితం బోరీ బందర్ (Boree Bunder-ముంబై) నుంచి తన్నా (Tanna-థానే) వరకు నడిచింది. శనివారం రోజు 170 ఏళ్ల రైల్వే సేవను పురస్కరించుకొని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CST)లో ప్రత్యేక లైట్, సౌండ్ (Light-N-Sound) షోను ఆర్గనైజ్ చేయడానికి సెంట్రల్ రైల్వే (CR) రెడీ అయ్యింది.
ఆదివారం రోజు సెంట్రల్ రైల్వే “నవరసంగం – ఏక్ గాథా CSMT కి (Navarasangam - Ek Gatha CSMT Ki)” అనే లైట్ అండ్ సౌండ్ కమ్ పెర్ఫార్మెన్స్ షో ను UNESCO హెరిటేజ్ సైట్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(CSMT) హెరిటేజ్ భవనంలో కండక్ట్ చేయనుంది. అప్పట్లో సుల్తాన్ (Sultan), సింధ్ (Sindh), సాహిబ్ (Sahib) అనే మూడు లోకోమోటివ్‌లు 400 మంది ప్రయాణికులతో 14 క్యారేజీలను లాగాయి. ఆసియాలోనే మొట్టమొదటి రైల్వే తిరిగిన ప్రాంతం ఒకప్పుడు బోరీ బందర్ గా ఉండేది. తర్వాత విక్టోరియా టెర్మినస్, తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ గా పేరు తెచ్చుకుంది. సెంట్రల్ రైల్వే (CR)కి పూర్వగామి (Predecessor)గా గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే (GIP) ద్వారా ఈ రైలు సర్వీసు నడిచింది. ఇండియాస్ ఫస్ట్ ట్రైన్ కి 21 మైళ్లు (33.8 కి.మీ) దూరంలో ఉన్న థానే చేరుకోవడానికి 57 నిమిషాల సమయం పట్టింది.
ఇండియన్ రైల్వేస్ 170 ఏళ్ల నిండిన రోజునే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, వరల్డ్ హెరిటేజ్ డే రావడం విశేషం. 1900లో, ఇండియన్ మిడ్‌ల్యాండ్ రైల్వే కంపెనీ సెంట్రల్ రైల్వేకి ముందున్న గ్రేట్ ఇండియన్ పెనిన్సులా (GIP) రైల్వేలో విలీనమైంది. దాని సరిహద్దులు ఉత్తరాన ఢిల్లీ నుంచి... ఈశాన్యంలో కాన్పూర్, అలహాబాద్ నుంచి... తూర్పున నాగ్‌పూర్ నుంచి... ఆగ్నేయంలో రాయచూర్ వరకు ఉన్నాయి. ఆ విధంగా, ముంబై నుంచి అనుసంధానం ద్వారా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 1951లో, నిజాం రాష్ట్రం, సింధియా రాష్ట్రం... ధోల్పూర్ స్టేట్ రైల్వేలను ఏకీకృతం చేయడం ద్వారా సెంట్రల్ రైల్వే ఏర్పడింది. ప్రస్తుతం, సెంట్రల్ రైల్వేలో ముంబై, భుసావల్, నాగ్‌పూర్, షోలాపూర్, పుణే అనే 5 డివిజన్లు ఉన్నాయి. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో 4,183 రూట్ కి.మీ.లో విస్తరించి ఉంది.
లైట్, సౌండ్ కమ్ పెర్ఫార్మెన్స్ షోలో నాట్యశాస్త్రంలోని తొమ్మిది రసాల్లో (భావోద్వేగాలు) వివిధ భావోద్వేగాల ద్వారా చరిత్రను వర్ణిస్తారు. సీఎస్ఎంటీ (CSMT) భవనం, రైల్వేలు, దేశ చరిత్రకి సంబంధించి వివిధ చారిత్రక ఎపిసోడ్‌ల ఆధారంగా విభిన్న భావోద్వేగాలను బయటకు తీసుకురావడానికి డ్యాన్స్, నాటకం, సంగీతం, కవిత్వం, స్వర ప్రదర్శనల ద్వారా షో జరుగుతుందని CR జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ లాహోటి చెప్పారు.
నవరసంగం – ఏక్ గాథా CSMT కి షో లో రైల్వే ఉద్యోగులైన 70 కళాకారులు భారతీయ సాంస్కృతిక కాన్వాస్‌ను ప్రదర్శిస్తారు. ఒరిజినల్ ఆడియో ట్రాక్‌ని కూడా రైల్వే కళాకారుల బృందం రూపొందించింది. లైట్లు, మ్యూజిక్ క్రియేషన్స్, స్టూడియో రికార్డింగ్ రంగాల నుండి ఎన్నో రిహార్సల్స్... ప్రొఫెషనల్ ఇన్‌పుట్‌ల తర్వాత షో అలరించడానికి రెడీ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Celebrations, Indian, Indian Railways