Indian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?

Indian Railways Tatkal Rules | తత్కాల్ కోటా టికెట్లు క్షణాల్లో బుక్ అవుతుంటాయి. అందుకే మీరు తత్కాల్‌లో టికెట్ తీసుకోవాలనుకుంటే మాత్రం టైమింగ్స్ గుర్తుంచుకోవాలి.

news18-telugu
Updated: November 18, 2019, 4:17 PM IST
Indian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?
Indian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పది రోజుల ముందు ప్లాన్ చేసుకొని రైలు టికెట్ బుక్ చేసుకుంటే బెర్త్ దొరకడం కష్టం. అలాంటిది ఒకట్రెండు రోజుల్లో రైలు టికెట్ కావాలంటే చాలా కష్టమే. అలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా జర్నీ ప్లాన్ చేసుకునేవారిని ఆదుకునేది తత్కాల్. తత్కాల్‌లో రైలు టికెట్ బుక్ చేయడం అంత సులువు కాదు. తత్కాల్ టికెట్లకు కొన్ని నియమనిబంధనలున్నాయి. వాటిని తెలుసుకొని బుక్ చేస్తేనే టికెట్ దొరికే అవకాశాలెక్కువ. రైలులో తత్కాల్ కోటాలో 30% సీట్లను కేటాయిస్తారు. వాటిని రైలు బయల్దేరడానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రేపు ప్రయాణం చేయాలనుకుంటే ఇవాళ తత్కాల్ టికెట్లు బుక్ చేయాలి. తత్కాల్ బుకింగ్ వేళలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏసీ క్లాస్ అంటే 2A, 3A, CC, 3E బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ క్లాస్ అంటే SL, FC, 2S బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియన్ రైల్వే కౌంటర్లలో లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేయొచ్చు. తత్కాల్ కోటా టికెట్లు క్షణాల్లో బుక్ అవుతుంటాయి. అందుకే మీరు తత్కాల్‌లో టికెట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ టైమింగ్స్ గుర్తుంచుకోవాలి.

ఇక తత్కాల్ టికెట్లు ఎవరైనా బుక్ చేయొచ్చు. కాకపోతే రెగ్యులర్‌గా ఉండే టికెట్ ఛార్జీల కన్నా కాస్త ఎక్కువ ఛార్జీలుంటాయి. ఒకేసారి 4 తత్కాల్ టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో జనరల్ కోటా, లేడీస్ కోటా లాంటివి వర్తించవు. ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చే రాయితీలు కూడా వర్తించవు. సెకండ్‌‌ క్లాస్ టికెట్‌కు బేసిక్ ఫేర్‌లో 10 శాతం, మిగతా క్లాసులకు 30 శాతం అదనంగా ఛార్జీలు వసూలు చెల్లించాలి. ఛార్జీల వివరాల కోసం ఈ టేబుల్ చూడండి.







Loading...

































క్లాస్ కనీస తత్కాల్ ఛార్జీలుగరిష్ట తత్కాల్ ఛార్జీలు
సెకండ్ సిట్టింగ్ రూ.10 రూ.15
స్లీపర్ రూ.90 రూ.175
ఏసీ ఛైర్ కార్ రూ.100 రూ.200
ఏసీ 3 టైర్ రూ.250 రూ.350
ఏసీ 2 టైర్ రూ.300 రూ.400
ఎగ్జిక్యూటీవ్ రూ.300 రూ.400

ఒక్కసారి తత్కాల్ టికెట్ బుక్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు రద్దైనా ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం ఛార్జీలుంటాయి. ఒకవేళ రైలు మూడు గంటల కన్నా ఆలస్యంగా వస్తున్నా, పలు కారణాల వల్ల రైలు రూట్ మార్చినా క్యాన్సలేషన్‌కు అనుమతి ఉంటుంది. తత్కాల్ బుకింగ్ సమయంలో ఎలాంటి ఐడీ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రయాణం సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటి ఐడీ ప్రూఫ్ ఏదైనా చూపించాలి.

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు



ఇవి కూడా చదవండి:

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC: రైల్వే ప్రయాణికులకు 49 పైసలకే రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ ఇస్తున్న ఐఆర్‌సీటీసీ

Sabarimala Special Trains: తెలంగాణ, ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్స్ ఇవే
First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...