హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maharajas' Express: ఇప్పుడు ఒక రాజులా ప్రయాణించవచ్చు.. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ లగ్జరీ ట్రైన్ బుకింగ్స్ ప్రారంభం.. స్పెషల్ ప్యాకేజీల వివరాలివే..

Maharajas' Express: ఇప్పుడు ఒక రాజులా ప్రయాణించవచ్చు.. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ లగ్జరీ ట్రైన్ బుకింగ్స్ ప్రారంభం.. స్పెషల్ ప్యాకేజీల వివరాలివే..

Maharajas' Express

Maharajas' Express

Maharajas' Express: ఇది ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ రైళ్లలో ఒకటి. నార్త్‌, సెంట్రల్‌, వెస్టర్న్‌ ఇండియాలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ఇండియన్ పనోరమా, ది ఇండియన్ స్ప్లెండర్, ది హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ట్రెజర్స్ ఆఫ్ ఇండియా అనే నాలుగు విలాసవంతమైన టూర్ ప్యాకేజీలను ఇండియన్ రైల్వేస్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రైల్వే ప్రయాణికులు (Train Passenges) ఒక రాజులా ప్రయాణించే సదుపాయాన్ని అందిస్తోంది ఇండియన్‌ రైల్వేస్ (Indian Railways). అల్ట్రా-లగ్జరీ ట్రైన్ టూర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే 'మహారాజాస్' ఎక్స్‌ప్రెస్‌(Maharajas' Express)కు బుకింగ్స్ తాజాగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ రైళ్లలో ఒకటి. నార్త్‌, సెంట్రల్‌, వెస్టర్న్‌ ఇండియాలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ఇండియన్ పనోరమా, ది ఇండియన్ స్ప్లెండర్, ది హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ట్రెజర్స్ ఆఫ్ ఇండియా అనే నాలుగు విలాసవంతమైన టూర్ ప్యాకేజీలను ఇండియన్ రైల్వేస్ అందిస్తోంది. ఇండియన్ పనోరమా, ది ఇండియన్ స్ప్లెండర్, ది హెరిటేజ్ ఆఫ్ ఇండియా ప్యాకేజీలో ఆరు రాత్రులు, 7-రోజుల సుదీర్ఘ పర్యటనలు ఉన్నాయి. అయితే ట్రెజర్స్ ఆఫ్ ఇండియా ప్యాకేజీలో 3-రాత్రులు, 4-రోజుల నిడివితో టూర్‌లు ఉన్నాయి.


అయితే ప్యాకేజీలతో సంబంధం లేకుండా, ప్రయాణీకులందరూ ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించవచ్చు, రణతంబోర్‌లోని టైగర్ రిజర్వ్ జంగిల్ సఫారీలో వృక్షాలను, జంతువులను అన్వేషించవచ్చు. జైపూర్‌లో అద్భుతంగా అలంకరించిన ఏనుగులను చూడవచ్చు. యూకేలోని రాయల్ స్కాట్స్‌మన్, ఐరోపాలోని ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ రైళ్ల కంటే మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కువ రేటింగ్ పొందింది.* మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు వివరాలు ఇవే..
ఇండియన్‌ రైల్వే ప్రయాణికులకు మహారాజులా ప్రయాణించే ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ఐదు ప్యాసింజర్ సెలూన్‌లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానిలో నాలుగు డీలక్స్ క్యాబిన్‌లు ఉంటాయి. మొత్తం మూడు జూనియర్ సూట్‌లలో ఆరు సెలూన్లు; ప్రతి రెండు సూట్‌లలో రెండు సెలూన్‌లు, గ్రాండ్ 'ప్రెసిడెన్షియల్ సూట్' కోసం ఒక సెలూన్ అన్నీ లగ్జరీ రెస్ట్‌రూమ్‌లతో ఉంటాయి. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి, అన్ని క్యాబిన్‌లలో LCD TVలు, DVD ప్లేయర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు, ఇన్‌ హౌస్‌ మూవీస్, లైవ్‌ టెలివిజన్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది నిజంగా రాయల్, చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది.


ప్రయాణికులు రైలు ప్రయాణం అంతటా సుందరమైన దృశ్యాలను ఆస్వాదించడానికి అన్ని క్యాబిన్‌లకు విశాలమైన కిటికీలు ఉంటాయి. ఇందులో ఇంకా రెండు ఫైన్-డైనింగ్ 'మహల్'లు-మయూర్ మహల్, రంగ్ మహల్ ఉన్నాయి. ఇవి ఒకేసారి 42 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తాయి. కొన్ని విదేశీ పానీయాలను రుచి చూడాలనుకునే వారి కోసం, మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌లో స్నాక్స్, డిన్నర్‌తో పాటు వైన్‌లు, బీర్లు, ఇతర పానీయాలు అందుబాటులో ఉంటాయి. ఆన్‌బోర్డ్‌లోని వారు పార్టీలను ఇష్టపడితే.. వారి కోసం మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకమైన క్రియేషన్‌లతో కూడిన హై-ఎండ్ బోటిక్‌తో పాటు 'రాజా క్లబ్' అనే లాంజ్ కమ్ బార్ కూడా ఉంది.


* మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు టూర్ ప్యాకేజీల వివరాలు:


* ఇండియన్ పనోరమా టూర్ ప్యాకేజీ:

ఈ టూర్ ప్యాకేజీ ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. 6 రాత్రులు, 7 రోజుల రైలు ప్రయాణంలో భారతదేశంలోని ప్రముఖ ప్రాంతాలను కవర్‌ చేస్తుంది. జైపూర్- రణతంబోర్, ఫతేపూర్ సిక్రీ - ఆగ్రా - ఓర్చా, ఖజురహో - వారణాసి - ఢిల్లీని కవర్ చేస్తుంది. అక్టోబర్- ఏప్రిల్ మధ్య బయలుదేరుతుంది.


* ఇండియన్ స్ప్లెండర్ టూర్ ప్యాకేజీ:

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుంచి ఆగ్రా - రణథంబోర్ - జైపూర్ - బికనీర్ - జోధ్‌పూర్ - ఉదయపూర్ - ముంబైలను కవర్ చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ 6-రాత్రులు, 7 రోజులు ఉంటుంది. అక్టోబర్-ఏప్రిల్‌లో బయలుదేరుతుంది.


ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు చక్కటి అవకాశం.. నెలకు రూ.50వేలు సంపాదించే ఐడియా


 * హెరిటేజ్ ఆఫ్ ఇండియా టూర్ ప్యాకేజీ:

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ముంబై నుంచి బయలుదేరి 6-రాత్రులు, 7-రోజులు ప్రయాణిస్తుంది. దేశ రాజధానిలో ప్రయాణం ముగుస్తుంది. ఇది ముంబై నుంచి ప్రారంభమై ఉదయపూర్ - జోధ్‌పూర్ - బికనీర్ - జైపూర్ - రణతంబోర్ - ఫత్‌పూర్ సిక్రీ (ఆగ్రా) - ఢిల్లీని కవర్ చేస్తుంది. అక్టోబర్-ఏప్రిల్‌లో బయలుదేరుతుంది.


* ట్రెజర్ ఆఫ్ ఇండియా టూర్ ప్యాకేజీ:

ఈ మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు టూర్ ప్యాకేజ్ 3-రాత్రులు 4-రోజుల్లో భారతదేశంలోని ప్రముఖ ప్రాంతాలను కవర్‌ చేస్తుంది. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీలో బయలుదేరి ఆగ్రా, రణథంబోర్, జైపూర్, ఢిల్లీలను కవర్ చేస్తుంది. అక్టోబర్-ఏప్రిల్‌లో బయలుదేరుతుంది.


* మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు టూర్ ప్యాకేజీని ఎలా బుక్ చేసుకోవాలి:

ప్రయాణికులు మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ విలాసవంతమైన టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Indian Railways, IRCTC, Tourism, Travel, Traveling

ఉత్తమ కథలు