Sankranti Special Trains | సంక్రాంతికి ఊరు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ (Railways) తీపికబురు అందించింది. అదనపు ట్రైన్లను (Train) నడుపుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల సంక్రాంతికి ఊరెళ్లని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఏ ఏ రూట్లలో అదనపు ట్రైన్లు నడువనున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వేస్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్‌ను నడుపనుంది. ప్రయాణికులు రద్దీ కారణంగా అదనపు ట్రైన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. విశాఖ పట్నం- సికింద్రాబాద్ – విశాఖ పట్నం మధ్యలో ఈ అదనపు ట్రైన్ నడువనుంది. అందువల్ల ఈ అదనపు ట్రైన్ వల్ల ప్రయాణికులకు సులభంగానే ట్రైన్ టికెట్లు బుక్ అవుతాయని చెప్పుకోవచ్చు. రద్దీ నేపథ్యంలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.100 నోట్లపై రాస్తే చెల్లవా? కేంద్రం ఏమంటోందంటే..
ట్రైన్ నెంబర్ 08505. విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్ ఇది. జనవరి 11న విశాఖ పట్నం నుంచి బయలు దేరుతుంది. జనవరి 13, జనవరి 16 తేదీల్లో కూడా ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రాత్రి 7.50 గంటలకు ట్రైన్ జర్నీ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్‌కు తర్వాతి రోజు ఉదయం 7.10 గంటలకు చేరుకుంటుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25,000 డిస్కౌంట్.. కొత్త ఏడాది కళ్లుచెదిరే ఆఫర్!
Secunderabad - Visakhapatnam #Sankranti #SpecialTrains pic.twitter.com/DBzEP0XKif
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2023
అలాగే ట్రైన్ నెంబర్ 08506 సికింద్రాబాద్ విశాఖ పట్నం స్పెషల్ ట్రైన్. ఇది సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. జనవరి 12, జనవరి 14, జనవరి 17 తేదీల్లో ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. రాత్రి 7.4 గంటలకు ప్రారంభం అవుతుంది. విశాఖ పట్నంకు తర్వాతి రోజు ఉదయం 8.20 గంటలకు చేరుకుంటుంది.
దువ్వాడ, అన్నవరం, తుని, సామర్లకోట, రాజమండ్రి , ఏలూరు , రాయనపాడు, ఖమ్మం , వరంగల్ , కాజీ పేట వంటి స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు స్పెషల్ ట్రైన్ టికెట్ బుకింగ్స్‌ను ఈ రోజు నుంచే చేసుకోవచ్చు. కాగా ఇండియన్ రైల్వేస్ కేవలం ఈ ఒక్క రూట్‌లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతోంది. అందువల్ల టికెట్లు బుక్ చేసుకోవాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రయాణం దగ్గరకు వచ్చినప్పుడు టికెట్ల కోసం చూడకుండా.. వెంటనే ఇప్పుడే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Railways, Secunderabad trains, South Central Railways, Special Trains, Trains