Indian Railways: మీ రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవచ్చు ఇలా

Indian Railways Reservation Rules | జర్నీ డేట్ మారినంత మాత్రానా టికెట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. మీకే ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు.

news18-telugu
Updated: May 12, 2019, 3:10 PM IST
Indian Railways: మీ రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవచ్చు ఇలా
Indian Railways: మీ రైలు టికెట్‌పై జర్నీ డేట్ మార్చుకోవచ్చు ఇలా
news18-telugu
Updated: May 12, 2019, 3:10 PM IST
మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా? మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ జర్నీ షెడ్యూల్ మారిందా? ఏం పర్లేదు. మీరు టికెట్ క్యాన్సిల్ చేయకుండానే టికెట్‌పై మీ జర్నీ డేట్ మార్చుకోవచ్చు. ముందు ఒక తేదీపై టికెట్ బుక్ చేసిన తర్వాత, జర్నీ ప్లాన్ మారితే ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మరో టికెట్ బుక్ చేయడం చాలామందికి అలవాటు. జర్నీ డేట్ మారినంత మాత్రానా టికెట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. మీకే ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. జర్నీ డేట్‌ను ముందుకు జరుపుకోవచ్చు. లేదా వాయిదా కూడా వేసుకోవచ్చు. మరి ఈ విషయంలో ఇండియన్ రైల్వే నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Read this: Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి

మీరు ఒకసారి రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టికెట్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే... అందుకు అవకాశం ఇస్తోంది ఇండియన్ రైల్వే. ప్రయాణ తేదీని కూడా మార్చుకోవచ్చు. స్టేషన్ కౌంటర్‌లో బుక్ చేసుకున్న టికెట్‌లో తేదీ మార్చుకోవాలంటే ఒకసారే అనుమతి ఉంటుంది. రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు మీరు టికెట్ బుక్ చేసుకున్న రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లి మీ టికెట్ సరెండర్ చేయాలి. అయితే మీరు మొదట ఏ క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకుంటే ఆ క్లాస్‌కు లేదా అంతకన్నా ఎక్కువ క్లాస్‌కు మాత్రమే మార్చుకోవాలి. మొదట ఫస్ట్ ఏసీ బుక్ చేసుకొని ఆ తర్వాత స్లీపర్ క్లాస్‌కి మార్చుకుంటామంటే కుదరదు. లోయర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Read this: PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...



మీరు టికెట్ ఎక్కడికి బుక్ చేసుకున్నారో... మళ్లీ అక్కడికే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా అంతకన్నా ముందుకు టికెట్ బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చుకోవచ్చు. ఇందుకోసం స్టేషన్ మాస్టర్‌కు రాతపూర్వకంగా రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సెంటర్‌లో సంప్రదించాలి. ఇది కూడా రైలు బయల్దేరడానికి 24 గంటలముందే అనుమతిస్తారు. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టికెట్లకు వర్తిస్తుంది.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైళ్లలో పాటలు, సినిమాలు... ప్రయాణికులకు ఫుల్ టైంపాస్

Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా

WhatsApp: వాట్సప్‌ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి

 
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...