హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Railways: అలర్ట్... రైలులో దూర ప్రయాణమా? టికెట్లతో పాటు ఇవి కూడా కొనాలి

Indian Railways: అలర్ట్... రైలులో దూర ప్రయాణమా? టికెట్లతో పాటు ఇవి కూడా కొనాలి

గతంలో రైలు ఛార్జీలలో మహిళలకు 50 శాతం తగ్గింపు, పురుషులకు 40 శాతం రాయితీ ఉండేది. ఇందుకోసం కనీస వయోపరిమితి మహిళలకు 58 ఏళ్లు, పురుషులకు 60 ఏళ్లు ఉండాలి. జూలై 2016లో, రైల్వే శాఖ టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో వృద్ధులకు ఇచ్చే మినహాయింపును ఐచ్ఛికంగా చేసింది.

గతంలో రైలు ఛార్జీలలో మహిళలకు 50 శాతం తగ్గింపు, పురుషులకు 40 శాతం రాయితీ ఉండేది. ఇందుకోసం కనీస వయోపరిమితి మహిళలకు 58 ఏళ్లు, పురుషులకు 60 ఏళ్లు ఉండాలి. జూలై 2016లో, రైల్వే శాఖ టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో వృద్ధులకు ఇచ్చే మినహాయింపును ఐచ్ఛికంగా చేసింది.

Indian Railways | మీరు దూర ప్రయాణం ప్లాన్ చేసుకున్నారా? రైలు టికెట్లు బుక్ (Train Ticket Booking) చేసుకున్నారా? ఇకపై బెడ్‌రోల్ కిట్స్ కూడా రైళ్లల్లో కొనాల్సి ఉంటుంది. ధర ఎంతో తెలుసుకోండి.

  భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులకు అలర్ట్. దూర ప్రయాణం చేసే ప్రయాణికులు ఇకపై రైలు టికెట్లతో పాటు బెడ్‌రోల్ కిట్స్ (Bedroll Kits) కూడా కొనాల్సి ఉంటుంది. రైళ్లల్లో ప్రయాణికులకు డిస్పోజబుల్ బ్లాంకెట్, పిల్లో అందించనుంది రైల్వే. గతంలో రైళ్లల్లో బ్లాంకెట్స్, పిల్లోస్‌ని ప్రయాణికులకు ఇచ్చేది భారతీయ రైల్వే. కానీ కరోనా వైరస్ మహమ్మారితో వీటిని ఇవ్వడం ఆపేసింది. గతంలో రైళ్లల్లో ప్రయాణికులకు బ్లాంకెట్స్, పిల్లోస్‌ని కొన్నిరోజుల తర్వాత ఉతికి మళ్లీ ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం వైరస్ భయాలు ఉండటంతో ఒకరు ఉపయోగించిన దుప్పట్లను మరొకరు ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. అందుకే వాటిని రైల్వే ఇవ్వట్లేదు.

  కరోనా వైరస్ మహమ్మారి తర్వాత రైల్వే సేవల్ని పునరుద్ధరించినా రైళ్లల్లో ప్రయాణికులకు గతంలో ఇచ్చినట్టుగా దుప్పటి, పిల్లో ఇవ్వట్లేదు రైల్వే. అయితే దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులు, రాత్రి వేళల్లో ప్రయాణించేవారికి దుప్పటి, పిల్లో, బెడ్ షీట్ అవసరం అవుతున్నాయి. ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే డిస్పోజబుల్ బ్లాంకెట్, పిల్లో, బెడ్ షీట్ అందించాలని భావిస్తోంది. అయితే వీటికి ప్రయాణికులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

  Indian Railways: గుడ్ న్యూస్... ఇక ఆ రైల్వే ప్రయాణికులు కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

  ఈ సర్వీస్ ఉపయోగించడానికి ప్రయాణికులు రూ.150 చెల్లించాలి. ఈ ధర జోన్ల వారీగా వేర్వేరుగా ఉంటుంది. రూ.150 చెల్లించి బెడ్‌రోల్ కిట్ కొంటే అందులో 48 x 75 అంగుళాల బెడ్ షీట్, 54 x 78 అంగుళాల బ్లాంకెట్, ఎయిర్ పిల్లో, పిల్లో కవర్, ఫేస్ టవల్ లేదా న్యాప్‌కిన్, మూడు ఫేస్ మాస్కులు లభిస్తాయి. కొన్ని జోన్స్‌లో వీటితో పాటు టూత్ పేస్ట్, శానిటైజర్ కూడా ఈ కిట్‌లో లభిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ కిట్ ఉపయోగకరంగా ఉంది.

  Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... విమానాల్లో ఉన్నట్టుగా రైళ్లలోనూ హోస్టెస్​ సేవలు

  bedroll kits on trains, bedrolls on trains, disposable bedroll kit price, disposable bedroll kits on trains, Indian Railways, indian railways bedroll kit price, ఇండియన్ రైల్వేస్, డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్, బెడ్‌రోల్ కిట్ ధర, భారతీయ రైల్వే

  కొన్ని జోన్లలో ఈ కిట్ ధర రూ.300 ఉంది. ఈ కిట్‌లో బ్లాంకెట్, బెడ్ షీట్, పిల్లో, పిల్లో కవర్, డిస్పోజబుల్ బ్యాగ్, టూత్ పేస్, టూత్ బ్రష్, హెయికర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ పౌచ్, పెప్పర్ సోప్, టిష్యూ పేపర్ లాంటివన్నీ ఈ కిట్‌లో ఉంటాయి. ఒకవేళ కేవలం బ్లాంకెట్ కావాలంటే రూ.150 చెల్లిస్తే చాలు. ప్రయాణికులకు బెడ్‌రోల్ కిట్స్ అందించే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. వారి సిబ్బంది రైళ్లల్లో ప్రయాణికులకు బెడ్‌రోల్స్ అమ్మనున్నారు.

  ప్రస్తుతం ఈ సదుపాయం కొన్ని రైళ్లల్లో మాత్రమే లభించనుంది. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో మాత్రమే ప్రస్తుతం ఈ సేవల్ని అందించాలని రైల్వే భావిస్తోంది ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, ముంబై-ఢిల్లీ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్, పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో బెడ్‌రోల్ కిట్స్ అమ్ముతోంది రైల్వే.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Indian Railways, IRCTC, Train tickets, Travel

  ఉత్తమ కథలు