హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమలకు 30 ప్రత్యేక రైళ్ల వివరాలివే

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమలకు 30 ప్రత్యేక రైళ్ల వివరాలివే

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Sabarimala Special Trains | శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 30 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Tirupati

శబరిమలలో నవంబర్ 16న మండల పూజ ప్రారంభం కానుందని ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవోసమ్ బోర్డ్ (Travancore Devaswom Board) ప్రకటించింది. వర్చువల్ క్యూలైన్ టోకెన్ల జారీని కూడా ప్రారంభించింది. దీంతో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న రైళ్లలో రిజర్వేషన్ చేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను (Sabarimala Special Trains) నడుపుతోంది. ఇప్పటివరకు 30 స్పెషల్ ట్రైన్స్‌ని ప్రకటించింది. ఆ రైళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి అందుబాటులో ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? పూర్తి వివరాలు తెలుసుకోండి.

రైలు నెంబర్ 07117 సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య నవంబర్ 20, డిసెంబర్ 4, 18 తేదీలతో పాటు 2023 జనవరి 8న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07118 కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 22, డిసెంబర్ 6, 20 తేదీలతో పాటు 2023 జనవరి 10న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి బుధవారం ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Sabarimala: శబరిమల భక్తులకు శుభవార్త... నిమిషానికి ఓ బస్సు నడపనున్న కేరళ ఆర్‌టీసీ

రైలు నెంబర్ 07117, రైలు నెంబర్ 07118 కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప , రాజంపేట, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.

రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య నవంబర్ 27, డిసెంబర్ 11, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 2.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07122 కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 29, డిసెంబర్ 13, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 17 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి బుధవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Sabarimala Virtual-Q: అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమల వర్చువల్ క్యూ లైన్ బుకింగ్ ప్రారంభం

రైలు నెంబర్ 07121, రైలు నెంబర్ 07122 చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు , గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.

రైలు నెంబర్ 07123 సికింద్రాబాద్ నుంచి కొల్లాంకు నవంబర్ 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు సోమవారం అర్ధరాత్రి మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మంగళవారం రాత్రి 11.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07124 కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు బుధవారం అర్ధరాత్రి 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి గురువారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07123, రైలు నెంబర్ 07124 చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.

రైలు నెంబర్ 07125 సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు నవంబర్ 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం 6.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

Bharat Gaurav Kashi Darshan Train: భారత్ గౌరవ్ కాశీ దర్శన్ ట్రైన్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

రైలు నెంబర్ 07126 కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు సోమవారం రాత్రి 11.15 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07125, రైలు నెంబర్ 07126 చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్‌లో ఆగుతాయి.

రైలు నెంబర్ 07119 నర్సాపురం నుంచి కొట్టాయంకు నవంబర్ 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి శనివారం తెల్లవారుజామున 3.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

రైలు నెంబర్ 07120 కొట్టాయం నుంచి నర్సాపూర్ రూట్‌లో నవంబర్ 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శనివారం రాత్రి 10.50 గంటలకు కొట్టాయంలో బయల్దేరి ఆదివారం సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

నర్సాపూర్-కొట్టాయం రూట్‌లో నడిచే ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు , కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.

First published:

Tags: Indian Railways, Sabarimala, Sabarimala Temple, Special Trains

ఉత్తమ కథలు