Indian Railways: ఇంత పొడవైన గూడ్స్ రైలు మీ జీవితంలో చూసి ఉండరు (Video)

Indian Railways: ఇంత పొడవైన గూడ్స్ రైలు మీ జీవితంలో చూసి ఉండరు (image: South East Central Railway)

Indian Railways | అతి పొడవైన గూడ్స్ రైలును నడిపి రికార్డ్ సృష్టించింది భారతీయ రైల్వే. ఆ గూడ్స్ రైలు ఎంత పొడవు ఉందో వీడియో చూడండి.

  • Share this:
    సాధారణ రైళ్లతో పోలిస్తే గూడ్స్ రైలు కాస్త పొడువుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ మీరు ఇప్పటివరకు ఎంత పొడవైన గూడ్స్ రైలు చూశారు? ఒకట్రెండు కిలోమీటర్ల గూడ్స్ రైలు చూసి ఉంటారు. కానీ మీరు ఇప్పుడు తెలుసుకోబోయేది భారతీయ రైల్వేకు చెందిన అతి పొడవైన గూడ్స్ రైలు గురించి. ఇంత పొడవైన గూడ్స్ రైలు మీ జీవితంలో చూసి ఉండరు. 3.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలు ఇది. ఆగ్నేయ రైల్వే అతి పొడవైన గూడ్స్ రైలును నడిపి భారతీయ రైల్వే చరిత్రలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. భారతీయ రైల్వే కొద్ది రోజుల క్రితం 'వాసుకి' పేరుతో పొడవైన గూడ్స్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రైలుకు మరో 5 రేక్స్‌ని జత చేసింది. అంటే ఐదు ఇంజిన్లను జత చేసింది. భిలాల్ డీ క్యాబిన్ నుంచి కోర్బా వరకు ప్రయాణించింది. 3.5 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు 224 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. వాసుకి గూడ్స్ రైలు ఎంత పొడవుందో ఈ వీడియోలో చూడండి.

    Indian Railways: రైలులో లోయర్ సైడ్ బెర్త్ మారిపోయింది ఇలా (Video)

    Vistadome Train: అద్దాల రైలు వీడియో రిలీజ్ చేసిన భారతీయ రైల్వే (Video)


    ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక గార్డు సాయంతో 295 వేగన్లతో 3.5 కిలోమీటర్ల వాసుకి గూడ్స్ రైలును ఇంత సక్సెస్‌ఫుల్‌గా నడిపింది భారతీయ రైల్వే. జనవరి 22న వాసుకి గూడ్స్ రైలు ఈ రికార్డు సృష్టించింది. భిలాల్ డీ క్యాబిన్ నుంచి కోర్బా వరకు ప్రయాణించేందుకు ఏడు గంటల సమయం పట్టింది. ఒకేసారి ఇంత దూరం, ఇంత సమయం ప్రయాణించడం కూడా రికార్డే. భారతీయ రైల్వే మొదటిసారిగా ఈ రికార్డు సాధించడంతో వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్.

    IRCTC e-Catering: ప్రయాణికులకు గమనిక... ఇక రైలులో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు... ఎప్పట్నుంచంటే

    IRCTC: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది? గతంలో కన్నా సింపుల్‌గా తెలుసుకోండి ఇలా


    ఇంతకుముందు భారతీయ రైల్వే శేష్ నాగ్, సూపర్ అనకొండ పేరుతో మరో రెండు పొడవైన గూడ్స్ రైళ్లను నడిపిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లను కూడా ఆగ్నేయ రైల్వే నడపడం విశేషం. ఈ రెండు రైళ్ల పొడవు 2.8 కిలోమీటర్లు. శేష్ నాగ్ గూడ్స్ రైలును నాగ్‌పూర్ డివిజన్ నుంచి బిలాస్‌పూర్ డివిజన్ మధ్య నడిపారు. దూరం 260 కిలోమీటర్లు. ఇక సూపర్ అనకొండ రైలును ఒడిషాలోని లజ్కురా నుంచి రౌర్కెలా మధ్య నడిపారు.
    Published by:Santhosh Kumar S
    First published: