హోమ్ /వార్తలు /బిజినెస్ /

Vistadome Train: అద్దాల రైలు వీడియో రిలీజ్ చేసిన భారతీయ రైల్వే (Video)

Vistadome Train: అద్దాల రైలు వీడియో రిలీజ్ చేసిన భారతీయ రైల్వే (Video)

Vistadome Train: అద్దాల రైలు వీడియో రిలీజ్ చేసిన భారతీయ రైల్వే
(image: Indian Railways)

Vistadome Train: అద్దాల రైలు వీడియో రిలీజ్ చేసిన భారతీయ రైల్వే (image: Indian Railways)

Vistadome Train | మీరు అద్దాల రైలులో ప్రయాణించాలనుకుంటున్నారా? అసలు అద్దాల రైలు లోపల ఎలా ఉంటుందో తెలుసా? విస్టాడోమ్ కోచ్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది భారతీయ రైల్వే.

పర్యాటకులను ఆకర్షించేందుకు భారతీయ రైల్వే అద్దాల రైలు కోచ్‌లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విస్టాడోమ్ కోచ్ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అసలు ఈ అద్దాల రైలు లోపల ఎలా ఉందో వివరంగా చూపిస్తూ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. భారతీయ రైల్వే ఇలా 10 కోచ్‌లను తయారు చేస్తోంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతున్నాయి. ప్రస్తుతం రెండు కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మిగతావి 2021 మార్చి 31 లోగా రెడీ అవుతాయి. పర్యాటక ప్రాంతాల్లో ఈ రైళ్లను నడపుతోంది భారతీయ రైల్వే. ఇప్పటికే అరకులో విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంది. అరకు వ్యాలీతో పాటు కాశ్మీర్ లోయ, డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే, కల్క షిమ్లా రైల్వే, నీల్‌గిరి మౌంటైన్ రైల్వే లాంటి ప్రాంతాల్లో ఈ విస్టాడోమ్ కోచ్‌లు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి.

విస్టాడోమ్ రైలులో ప్రయాణం... అదిరిపోవడం ఖాయం. ఎన్నో అత్యాధునికమైన హంగులతో ఈ రైలు తయారవుతోంది. ఇటీవల విస్టాడోమ్ కోచ్‌ను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. సరికొత్త టెక్నాలజీ, అత్యాధునికమైన సదుపాయాలతో రూపొందించిన ఈ రైలులో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ అన్నారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా విస్టాడోమ్ కోచ్‌లను చూసి భారతీయ రైల్వేను ప్రశంసించారు. ప్రయాణాన్ని మైళ్ల లెక్కన కాకుండా జ్ఞాపకాల లెక్కన గుర్తుంచుకోవాలన్న మాటను ఈ కోచ్ నిజం చేస్తుందని పీయూష్ గోయల్ అన్నారు. భారతీయ రైల్వే విడుదల చేసిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.

Indian Railways: రైలులో లోయర్ సైడ్ బెర్త్ మారిపోయింది ఇలా (Video)

Paytm Instant Personal Loan: 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్... పేటీఎం యూజర్లకు మాత్రమే

Mystique train journeys along incredible natural landscapes to become even more enthralling !

భారతీయ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ విస్టాడోమ్ కోచ్‌ను తయారు చేసింది. మొదటిసారిగా ఎల్‌హెచ్‌బీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కోచ్‌ను తయారు చేసింది భారతీయ రైల్వే. విస్టాడోమ్ కోచ్ ఇటీవలే ట్రయల్స్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. విస్టాడోమ్ కోచ్ ప్రత్యేకతలు చూస్తే ఈ కోచ్ విశాలంగా ఉంటుంది. రూఫ్ టాప్ గ్లాస్‌తో ఉంటుంది. ఒక కోచ్‌లో 44 సీట్లు ఉంటాయి. ఈ సీట్లను 180 డిగ్రీలు తిప్పేయొచ్చు. అదే ఈ సీట్ల ప్రత్యేకత. విస్టాడోమ్ కోచ్‌లో వైఫై బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది.

Jio 28 days plans: జియో ప్లాన్ బెనిఫిట్స్ మారాయి... 28 రోజుల వేలిడిటితో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... మీ అకౌంట్ డిలిట్ కావద్దంటే వెంటనే ఈ పనిచేయండి

ప్రతీ సీటుకు స్క్రీన్ ఉంటుంది. ప్రయాణికులు తమ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ ఉపయోగించి వైఫై ద్వారా తమకు కావాల్సిన కంటెంట్ చూడొచ్చు. మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. విస్టాడోమ్ కోచ్‌లో మినీ ప్యాంట్రీ ఉంటుంది. అక్కడ కాఫీ మేకర్, బాటిల్ కూలర్, రిఫ్రిజిరేటర్, వాష్ బేసిన్ లాంటివి ఉంటాయి. కోచ్‌లల్లో సీసీటీవీ నిఘా కూడా ఉంటుంది.

First published:

Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways, Train, Train tickets

ఉత్తమ కథలు