Indian Railways: ఇక రైళ్లల్లో మసాజ్ సర్వీస్... జస్ట్ రూ.100 మాత్రమే

Indian Railways | గోల్డ్, డైమండ్, ప్లాటినం పేరుతో మూడు రకాల మసాజ్ సర్వీసులు ఉన్నాయి. రూ.100, రూ.200, రూ.300 చొప్పున ఛార్జ్ చేస్తారు. హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్‌కు కేవలం రూ.100 చెల్లిస్తే చాలు.

news18-telugu
Updated: June 8, 2019, 3:31 PM IST
Indian Railways: ఇక రైళ్లల్లో మసాజ్ సర్వీస్... జస్ట్ రూ.100 మాత్రమే
Indian Railways: ఇక రైళ్లల్లో మసాజ్ సర్వీస్... జస్ట్ రూ.100 మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే నుంచి ఇక మసాజ్ సేవలు అందనున్నాయి. రైల్వే స్టేషన్‌లో కాదు... కదిలే రైళ్లలోనే ప్రయాణికులు ఈ సేవలు పొందొచ్చు. ఇప్పటికే ఇండోర్ నుంచి వెళ్లే 39 రైళ్లల్లో మసాజ్ సేవలు ప్రారంభిస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే చరిత్రలోనే ఇలాంటి సేవలు అందించడం ఇదే మొదటిసారి. దీని ద్వారా రైల్వే ఆదాయం పెరగడం మాత్రమే కాదు, ప్రయాణికుల్ని ఆకర్షించడానికి మసాజ్ సర్వీస్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మసాజ్ సర్వీస్ ద్వారా వార్షికంగా రూ.20 లక్షలు, 20,000 మంది ప్రయాణికులు పెరిగితే మరో రూ.90 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

రైల్వే ఆదాయం పెంచుకోవడానికి వినూత్న ఆలోచనల్ని అమలు చేయాలని భారతీయ రైల్వే అన్ని జోన్లను ఆదేశించడంతో వెస్టర్న్ రైల్వే జోన్‌లోని రాత్లాం డివిజన్ అధికారులు 'మసాజ్ సర్వీస్' ప్రతిపాదన పంపారు. దానికి ఆమోద ముద్ర పడటంతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. 15-20 రోజుల్లో ఈ సేవలు మొదలవుతాయి. గోల్డ్, డైమండ్, ప్లాటినం పేరుతో మూడు రకాల మసాజ్ సర్వీసులు ఉన్నాయి. రూ.100, రూ.200, రూ.300 చొప్పున ఛార్జ్ చేస్తారు. హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్‌కు కేవలం రూ.100 చెల్లిస్తే చాలు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మసాజ్ సేవలు లభిస్తాయి. రైళ్లల్లో మసాజ్ సర్వీస్ ఆదాయాన్ని, ప్రయాణికుల సంఖ్యను పెంచితే మిగతా రైల్వే జోన్లలో కూడా ఈ సేవలు ప్రారంభించే అవకాశముంది.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి




ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి 3 సౌతిండియా టూర్ ప్యాకేజీలు

PF Withdrawal: ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి ఇలా...SBI Good News: ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి... ఎందుకో తెలుసా?
First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>