• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • INDIAN RAILWAYS MOST POWERFUL LOCOMOTIVE JOINS ITS NETWORK NK

Indian Railways : మేక్ ఇన్ ఇండియాలో తయారైన పవర్‌ఫుల్ రైల్ ఇంజిన్...

Indian Railways : మేక్ ఇన్ ఇండియాలో తయారైన పవర్‌ఫుల్ రైల్ ఇంజిన్...

Indian Railways : మేక్ ఇన్ ఇండియాలో తయారైన పవర్‌ఫుల్ రైల్ ఇంజిన్... (credit - twitter)

Indian Railways : టెక్నాలజీలో భారత దేశం మరో అడుగు ముందుకేసింది. అత్యంత శక్తిమంతమైన దేశీయ రైలు ఇంజిన్‌ను తయారుచేసింది.

  • Share this:
    Indian Railways : మేక్ ఇన్ ఇండియాలో భాగంగా... భారత దేశంలో తయారైన అత్యంత శక్తిమంతమైన లోకోమోటివ్... ది వాగ్12B... భారతీయ రైల్వేలో చేరింది. ఇది అలాంటిలాంటి రైల్ ఇంజిన్ కాదు. ఇది 12000 హార్స్ పవర్‌ (HP)తో తయారైంది. ఫ్రెంచ్ కంపెనీ అల్‌స్టోమ్‌తో కలిసి దీన్ని తయారుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఇంజిన్ పని ప్రారంభించింది. ఇది అత్యంత భారీ సంఖ్యలో బోగీలను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లగలదు. అందుకే దీన్ని ప్రత్యేత ఫ్రైట్ కారిడార్‌లో ఉపయోగించాలని నిర్ణయించారు.


    దీన్ దయాళ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఇంజిన్... 118 బోగీలను తనతో తీసుకెళ్లింది. దీన్ని బట్టీ ఇది ఎంత పవర్‌ఫుల్లో ఊహించుకోండి. దీని ద్వారా.. ప్రపంచంలో అత్యధిక హార్స్ పవర్ కలిగిన రైల్ ఇంజిన్లు దేశీయంగా తయారుచేసే దేశాల్లో ఇండియా... ఆరో స్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ విజన్ అయిన మేక్ ఇన్ ఇండియాకి ఈ లోకోమోటివ్ నిదర్శనం అంటూ... రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.


    రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI)ని కేంద్రం ఆహ్వానించడంతో... 2015లో అల్‌స్టోమ్ కంపెనీ ఇండియన్ రైల్వేస్‌తో చేతులు కలిపింది. ఇండియాలో 800 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ (రైలు ఇంజిన్లు) తయారు చెయ్యడానికి... రూ.29వేల కోట్ల డీల్ కుదుర్చుకుంది. అందులో భాగంగా... తొలి ఇంజిన్ పట్టాలెక్కింది.

    బీహార్‌లోని మధేపురాలో రైల్ ఇంజిన్ల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఏడాదికి 120 ఇంజిన్లను తయారుచేయగలిగే సామర్ధ్యం ఆ ఫ్యాక్టరీకి ఉంది. మొత్తం 10వేల మందికి అక్కడ ఉపాధి దొరుకుతోంది. కేంద్రం ఆ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టింది. మరో ఫ్యాక్టరీని మహారాష్ట్ర... నాగపూర్‌లో నిర్మిస్తున్నారు.

    పైన చూసిన ఇంజిన్ కోసం ఇండియా, ఫ్రాన్స్ నుంచి 300 మంది ఇంజినీర్లు... బెంగళూరు, మాదేపుర, ఫ్రాన్స్‌లో పనిచేశారు. రెండేళ్ల కాలంలో... 90 శాతానికి పైగా పార్టుల్ని ఇండియాలో తయారుచేశారు. అలా మేక్ ఇన్ ఇండియా కల సాకారం అయినట్లైంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు