హోమ్ /వార్తలు /బిజినెస్ /

Railway Helpline Number: అలర్ట్... ఆ రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ పనిచేయదు... కాల్ చేయాల్సిందే కొత్త నెంబర్‌కే

Railway Helpline Number: అలర్ట్... ఆ రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ పనిచేయదు... కాల్ చేయాల్సిందే కొత్త నెంబర్‌కే

Railway Helpline Number | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. మీరు రైల్వే సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేస్తూ ఉంటారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Railway Helpline Number | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. మీరు రైల్వే సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేస్తూ ఉంటారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Railway Helpline Number | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. మీరు రైల్వే సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేస్తూ ఉంటారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

  భారతీయ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను విలీనం చేసింది. గతంలో భారతీయ రైల్వేకు వేర్వేరు హెల్ప్ లైన్ నెంబర్లు ఉండేవి. వాటిని గతేడాది విలీనం చేసింది. కేవలం రెండు నెంబర్లను మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. రైలు ఎంక్వైరీల కోసం ప్రయాణికులు 139 నెంబర్‌కు, సెక్యూరిటీ సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం కోసం 182 నెంబర్‌ను మాత్రమే యాక్టీవ్‌లో ఉంచింది. ఇన్నాళ్లూ ప్రయాణికులు ఈ రెండు నెంబర్లకే కాల్ లేదా ఎస్ఎంఎస్ చేసేవారు. ఇప్పుడు ఈ రెండు నెంబర్లను కూడా విలీనం చేసింది భారతీయ రైల్వే. సెక్యూరిటీ హెల్ప్‌లైన్ నెంబర్ 182 ను రైల్ మదద్ హెల్ప్‌లైన్ నెంబర్ 139 లో కలిపింది. అంటే ఇకపై కేవలం రైల్ మదద్ హెల్ప్‌లైన్ నెంబర్ 139 మాత్రమే పనిచేస్తుంది. 182 హెల్ప్‌లైన్ నెంబర్ పనిచేయదు.

  రైళ్లల్లో చోరీలు, వేధింపులు, ఇతర నేరాలకు సంబంధించిన కంప్లైంట్లు చేయడానికి ఇన్నాళ్లూ 182 నెంబర్ యాక్టీవ్‌గా ఉండేది. కానీ ఇకపై ప్రయాణికులు భద్రతకు సంబంధించిన అంశాల కోసం 139 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్ల కోసం గూగుల్‌లో వెతకాల్సిన అవసరం లేకుండా 139 నెంబర్ గుర్తు పెట్టుకుంటే చాలు. 182 హెల్ప్‌లైన్ నెంబర్‌తో పాటు భారతీయ రైల్వే ఇప్పటి వరకు నిలిపివేసిన నెంబర్ల వివరాలు చూస్తే జనరల్ కంప్లైంట్ నెంబర్ 138, కేటరింగ్ సర్వీస్ నెంబర్ 1800111321, విజిలెన్స్ నెంబర్ 152210, యాక్సిడెంట్ సేఫ్టీ నెంబర్ 1072, క్లీన్ మై కోచ్ నెంబర్ 58888/138, ఎస్ఎంఎస్ కంప్లైంట్ నెంబర్ 9717630982 పనిచేయట్లేదు.

  Indian Railways: రైలు ప్రయాణికుల ప్రైవసీ కోసం ప్రత్యేక కిటికీలు... ఎలా ఉంటాయంటే

  February 2021 Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? మీకు శుభవార్త

  ప్రయాణికులు ఏ అవసరానికైనా 139 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు. 139 హెల్ప్‌లైన్ నెంబర్ 12 భాషల్లో పనిచేస్తుంది. ఇంటరాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్-IVRS ద్వారా ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. 139 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసిన తర్వాత సెక్యూరిటీ, వైద్య అవసరాల కోసం 1 డయల్ చేస్తే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటీవ్‌కు కనెక్ట్ అవుతుంది. ఎంక్వైరీ కోసం 2 డయల్ చేయాలి. అందులో పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల వేళలు, వసతి, టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సలేషన్, వేక్ అప్ అలారం ఫెసిలిటీ, డెస్టినేషన్ అలర్ట్, వీల్ చైర్ బుకింగ్, మీల్స్ బుకింగ్ లాంటి సేవలు లభిస్తాయి. 3 డయల్ చేస్తే కేటరింగ్ కంప్లైంట్స్, 4 డయల్ చేస్తే జనరల్ కంప్లైంట్స్, 5 డయల్ చేస్తే విజిలెన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు, 6 ప్రెస్ చేస్తే ప్రమాదాలకు సంబంధించి 9 డయల్ చేస్తే ఫిర్యాదుల స్టేటస్ వివరాలు తెలుస్తాయి. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటీవ్‌తో మాట్లాడటానికి * ప్రెస్ చేయాలి.

  Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ కొత్త రూల్స్ గుర్తుంచుకోండి

  Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

  ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్ మదద్ హెల్ప్‌లైన్‌ యాప్ కూడా ఉంది. గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో అనేక ఫీచర్స్ తీసుకొస్తోంది భారతీయ రైల్వే. రైల్ మదద్ యాప్ ద్వారా కంప్లైంట్స్ చేయొచ్చు. ఫోటోలు కూడా అప్‌లోడ్ చేసే ఫీచర్‌ను కూడా ప్రారంభించింది. వెబ్‌సైట్ ద్వారా కంప్లైంట్స్ చేయాలంటే https://railmadad.indianrailways.gov.in/ పోర్టల్ కూడా ఉంది.

  First published:

  Tags: Indian Railway, Indian Railways, IRCTC, Railways, Train, Train tickets

  ఉత్తమ కథలు