Indian Railways: అటెన్షన్ ప్లీజ్... రైలు టికెట్ల ధరలు పెరగబోతున్నాయి... ఎంతో తెలుసా?

Indian Railways: అటెన్షన్ ప్లీజ్... రైలు టికెట్ల ధరలు పెరగబోతున్నాయి... ఎంతో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | రైల్వే పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నందున రైలు టికెట్ ఛార్జీల పెంపు అంశాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తోంది.

  • Share this:
    రైలు ప్రయాణికులకు ఎక్కువగా శుభవార్తలు చెప్పే భారతీయ రైల్వే... త్వరలో ఓ షాకింగ్ న్యూస్ చెప్పబోతోంది. ప్రభుత్వం రైలు టికెట్ల ధరల్ని పెంచే ఆలోచనలో ఉందన్న వార్తలొస్తున్నాయి. రైల్వేస్ బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోయినా... అలాంటి చర్యలు ఉండబోతున్నట్టు సూచనప్రాయంగా చెప్పారు. భారతీయ రైల్వే 'హేతుబద్ధీకరణ' గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారాయన. అయితే సరుకు రవాణా ఛార్జీలు మాత్రం పెరగవని చెప్పారు. "రైలు టికెట్లు, సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించబోతున్నాం. ఇప్పటికే సరుకు రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సరుకు రవాణా ఛార్జీలు పెంచే ఆలోచన అయితే లేదు. లాజిస్టిక్ కాస్ట్ తగ్గించేందుకు సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించాల్సిందే" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ వీకే యాదవ్ అన్నారు.

    రైల్వే పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నందున రైలు టికెట్ ఛార్జీల పెంపు అంశాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తోంది. భారతీయ రైల్వే. అయితే రైలు ఛార్జీలను పెంచే ఆలోచన లేదని, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని రైల్వేస్ బోర్డ్ అధికార ప్రతినిధి ఆర్‌డీ బాజ్‌పేయి తెలిపారు. "రైల్వే ఛార్జీల హేతుబద్ధీకరణ అంటే రైలు టికెట్ ధరలు పెరుగుతాయని మాత్రమే కాదు, తగ్గొచ్చు కూడా" అని అన్నారాయన. త్వరలో రైలు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నవే. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. ఒకవేళ రైలు ఛార్జీలు పెరిగితే సుమారు 10 శాతం పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.

    లోయర్ క్లాస్ ఛార్జీలను మినహాయించి, ఇతర క్లాసుల్లో వేర్వేరు శ్లాబుల్లో కిలోమీటర్ చొప్పున ఛార్జీలు పెంచడం లాంటి అంశాలతో రైలు ఛార్జీల పెంపు ప్రతిపాదనను రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. గత ఆరేళ్లుగా ఛార్జీలు కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడంలో రైల్వే విఫలం కావడంతో టికెట్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2014 లో రైలు టికెట్ ఛార్జీలు 14.2 శాతం, సరుకు రవాణా ఛార్జీలు 6.6 శాతం పెరిగాయి.

    Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ

    IRCTC: సంక్రాంతికి రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు

    Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు... టైమింగ్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published: