Indian Railways: ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రారంభించిన భారతీయ రైల్వే... ఉపయోగాలివే

Indian Railways SMS service | భారతీయ రైల్వే నుంచి ఇలాంటి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందాలంటే ప్రయాణికులు రైలు టికెట్ బుక్ చేసే సమయంలో రిజర్వేషన్ ఫామ్‌లో ఫోన్ నెంబర్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసినా ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

news18-telugu
Updated: August 13, 2019, 4:33 PM IST
Indian Railways: ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రారంభించిన భారతీయ రైల్వే... ఉపయోగాలివే
Indian Railways: ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రారంభించిన భారతీయ రైల్వే... ఉపయోగాలివే
  • Share this:
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే ఎస్ఎంఎస్ సర్వీస్‌ను ప్రారంభించింది. బెర్త్ కన్ఫర్మేషన్ దగ్గర్నుంచి రైళ్ల లైవ్ స్టేటస్ వరకు అన్నీ రియల్‌-టైమ్‌లో అందించేందుకు ఎస్ఎంఎస్ సేవల్ని అందిస్తోంది. భారతీయ రైల్వే ప్రయాణికులకు టికెట్ల జారీ, సరుకు సేవలు, రైళ్ల రాకపోకల నియంత్రణ, రైల్వే నిర్వహణ లాంటివి చూసుకునే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సెంటర్-CRIS ఈ ఎస్ఎంఎస్ సర్వీస్ అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా మీరు ఎక్కాల్సిన రైలుకు సంబంధించిన అప్‌డేట్స్ రియల్‌టైమ్‌లో మీకు తెలుస్తాయి. ఇకపై రైలు ఎప్పుడు వస్తుందో ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తూ ఉండాల్సిన అవసరం లేదు. రైలు వచ్చే సమయం మీ ఫోన్‌కే ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. రైలు ఆలస్యంగా నడుస్తుందా? సమయానికే వస్తుందా? అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. రైళ్ల వేళలు మాత్రమే కాదు... రైలు క్యాన్సిల్ అయినా ఆ సమాచారం వెంటనే ఎస్ఎంఎస్‌లో లభిస్తుంది. ఎస్ఎంఎస్ సర్వీస్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.

Indian Railways SMS Service: ఎస్ఎంఎస్ ద్వారా రైల్వే పంపే సమాచారం ఇదే



1. Pre-chart SMS alert: ప్రయాణానికి ఐదు రోజుల ముందు (రిజర్వేషన్ స్టేటస్ మారితే)
2. Post chart SMS alert: చార్ట్ ప్రిపరేషన్ వెంటనే (టికెట్ స్టేటస్‌లో మార్పు ఉంటే)
3. Reschedule: రైలు 20 నిమిషాల కన్నా ఎక్కువ రీషెడ్యూల్ అయినప్పుడు.


4. Cancellation: రైలు రద్దైనప్పుడు.
Loading...
5. Delay: రైలు 1 గంట కన్నా ఎక్కువ ఆలస్యంగా నడిచినప్పుడు.
6. Diversion: ప్రకృతి వైపరీత్యం లేదా సాంకేతిక సమస్య కారణంగా రైలు రూట్‌ను మార్చినప్పుడు.
7. Short termination: సాంకేతిక కారణాల వల్ల రైలును ఆపినప్పుడు.
8. Confirmation of reservation: వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ స్టేటస్ ఉన్నవారికి సీట్ లేదా బెర్త్ కన్‌ఫామ్ అయినప్పుడు.
9. Destination Alert: ప్రయాణికులు రైలు దిగాల్సిన స్టేషన్ సమీపిస్తున్నప్పుడు.

భారతీయ రైల్వే నుంచి ఇలాంటి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందాలంటే ప్రయాణికులు రైలు టికెట్ బుక్ చేసే సమయంలో రిజర్వేషన్ ఫామ్‌లో ఫోన్ నెంబర్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసినా ఫోన్ నెంబర్ ఇవ్వాలి. రైలు టికెట్ బుక్ చేయగానే ప్రయాణికుల ఫోన్ నెంబర్, పీఎన్ఆర్ ఎస్ఎంఎస్ సర్వీస్ సిస్టమ్‌తో అనుసంధానం అవుతుంది.

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

IRCTC: హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటున్నారా? ప్యారిస్ తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ

Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా...

JIO Gigafiber: సెప్టెంబర్ 5న గిగాఫైబర్ లాంఛ్... ప్రీమియం ప్లాన్‌తో టీవీ ఉచితం
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...