Indian Railways: రైలు బోగీ డర్టీగా ఉందా? క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు ఇలా...

Indian Railways Clean My Coach Services | మీ సమస్య రైలు బోగీకి సంబంధించినదై ఉంటేనే కోచ్ మిత్రలో ఫిర్యాదు చేయొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఫిర్యాదు చేయొచ్చు.

news18-telugu
Updated: April 27, 2019, 8:11 AM IST
Indian Railways: రైలు బోగీ డర్టీగా ఉందా? క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు ఇలా...
Indian Railways: రైలు బోగీ డర్టీగా ఉందా? క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు ఇలా...
news18-telugu
Updated: April 27, 2019, 8:11 AM IST
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీకు రైలులో ఏమాత్రం అపరిశుభ్రంగా, అసౌకర్యంగా అనిపించినా క్షణాల్లో కంప్లైంట్ చేయొచ్చు. రైల్వే సిబ్బంది ఎక్కడున్నారో వెతుక్కొని లేదా రైలు దిగాక స్టేషన్‌లో అధికారుల దగ్గరకు వెళ్లి మరీ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు. క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు. భారతీయ రైల్వే సరికొత్తగా అందిస్తున్న 'Coach Mitra' సేవలివి. రైలులో ఫ్యాన్ ఆగిపోయినా, ఛార్జింగ్ పోర్ట్ సరిగ్గా పనిచేయకపోయినా, బోగీలు మురికిగా ఉన్నా, వాష్‌ రూమ్‌లు సరిగ్గా శుభ్రం చేయకపోయినా... ఇలా ఏ సమస్య ఉన్నా సరే కోచ్ మిత్రలో కంప్లైంట్ చేయొచ్చు. అయితే మీ సమస్య రైలు బోగీకి సంబంధించినదై ఉంటేనే కోచ్ మిత్రలో ఫిర్యాదు చేయొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఫిర్యాదు చేయొచ్చు. నేరుగా cleanmycoach.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మీ కంప్లైంట్ నేరుగా సంబంధిత అధికారులకు వెళ్తుంది. వాళ్లు వెంటనే చర్యలు ప్రారంభిస్తారు. 2,167 రైళ్లలో ఈ సేవలు లభిస్తాయి. మరి వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా ఎలా కంప్లైంట్ చేయొచ్చో తెలుసుకోండి.

Read this: Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

Indian Railways, railway complaint app, railway complaint number, railway complaint website, coach mitra, coach mitra login, coach mitra app, coach mitra indianrail, clean my coach, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే, రైల్వే కంప్లైంట్ యాప్, రైల్వే కంప్లైంట్ వెబ్‌సైట్, రైల్వే కంప్లైంట్ నెంబర్, కోచ్ మిత్ర యాప్, కోచ్ మిత్ర వెబ్‌సైట్, కోచ్ మిత్ర సర్వీసెస్, క్లీన్ మై కోచ్
image: http://cleanmycoach.com/


కోచ్ మిత్ర వెబ్‌సైట్




మీరు వెబ్‌సైట్‌లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కోచ్ మిత్ర వెబ్‌సైట్ cleanmycoach.com ఓపెన్ చేయాలి. మీ పీఎన్ఆర్ నెంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డ్రాప్‌డౌన్ లిస్ట్‌లో Toilet cleaning, train lighting... ఇలా వేర్వేరు కంప్లైంట్స్ ఉంటాయి. మీ కంప్లైంట్ పైన క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. మీరు ఎంటర్ చేసే పీఎన్ఆర్ నెంబర్ ద్వారా మీ రైలును ట్రాక్ చేస్తారు. సంబంధిత అధికారులు వెంటనే సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మీ పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వొచ్చు.

Indian Railways, railway complaint app, railway complaint number, railway complaint website, coach mitra, coach mitra login, coach mitra app, coach mitra indianrail, clean my coach, ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే, రైల్వే కంప్లైంట్ యాప్, రైల్వే కంప్లైంట్ వెబ్‌సైట్, రైల్వే కంప్లైంట్ నెంబర్, కోచ్ మిత్ర యాప్, కోచ్ మిత్ర వెబ్‌సైట్, కోచ్ మిత్ర సర్వీసెస్, క్లీన్ మై కోచ్
image: Playstore

కోచ్ మిత్ర యాప్

Loading...
మీరు కోచ్ మిత్ర యాప్‌లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ ప్లేస్టోర్‌లో CoachMitra యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కోచ్ మిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మీ పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి, కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మీ కంప్లైంట్ కంట్రోల్ ఆఫీసుకి వెళ్తుంది. వారి ద్వారా రైలులో ఉండే సిబ్బందికి ఫిర్యాదు అందుతుంది.

కోచ్ మిత్ర ఎస్ఎంఎస్


స్మార్ట్‌ఫోన్ లేకపోయినా మీరు రైలు కోచ్‌లో సమస్యలపై ఎస్ఎంఎస్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు. ఈ కింది ఫార్మాట్‌లో 58888 లేదా 9200003232 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. CLEAN అని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి టాయిలెట్ క్లీనింగ్ కోసం T, కోచ్ క్లీనింగ్ కోసం C, వాటరింగ్ కోసం W, పెస్ట్ కంట్రోల్ కోసం P, బెడ్‌షీట్ కోసం B, ట్రైన్ లైటింగ్ కోసం E, రిపేర్ కోసం R అని టైప్ చేయాల్సి ఉంటుంది.

Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్


ఇవి కూడా చదవండి:

SBI Loans: ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...

Sony TV: టీవీ ధర రూ.50 లక్షలు... సైజ్ 98 అంగుళాలు

Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...
First published: April 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...