హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC: రైలులో ఫుడ్ ఫ్రీ... కానీ ఓ కండీషన్

IRCTC: రైలులో ఫుడ్ ఫ్రీ... కానీ ఓ కండీషన్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways No Bill The food is free | రైళ్లల్లో ప్రయాణించే వారి కోసం సరికొత్త పాలసీని ప్రకటించింది భారతీయ రైల్వే. రైళ్లల్లో భోజనం అమ్మే విషయంలో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టింది. అంతేకాదు... తేడా వస్తే ఫుడ్ ఉచితంగా తీసుకోవచ్చని చెబుతోంది.

ఇంకా చదవండి ...

  మీరు తరచూ రైలులో దూర ప్రయాణం చేస్తుంటారా? రైలులోనే ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటారా? మీరు ఫుడ్ పార్శిల్ తీసుకునేప్పుడు బిల్ చెక్ చేశారా? ఫుడ్ బిల్లు విషయంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. వేల సంఖ్యలో ఐఆర్‌సీటీసీకి కంప్లైంట్స్ వస్తున్నాయి. వాస్తవంగా ఉండే బిల్లు కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారన్నది ఆ కంప్లైంట్ సారాంశం. బిల్లు కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని భారతీయ రైల్వే అనేక సార్లు స్పష్టం చేసింది కూడా. అయినా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రయాణికులు ఎక్కువ బిల్లు చెల్లించి నష్ట పోతున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది భారతీయ రైల్వే. 'నో బిల్-ది ఫుడ్ ఈజ్ ఫ్రీ' అనే ప్రయత్నంతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తోంది. అంటే 'బిల్లు లేకపోతే భోజనం ఉచితం' అన్నది ఆ ప్రకటన సారాంశం.

  మీరు తరచూ రైళ్లల్లో ప్రయాణిస్తున్నట్టైతే రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో మీరు కొనే ఆహార పదార్థాలకు బిల్లు తీసుకోవాలి. ఆహారపదార్థాలు అమ్మేవారి దగ్గర పీఓఎస్ మెషీన్లు కూడా ఉంటాయి. మీరు చెల్లించే డబ్బులకు బిల్లు తీసుకోవచ్చు. ప్రయాణికులకు బిల్లు ఇవ్వాల్సి రావడంతో అమ్మకందారులు ఎక్కువగా వసూలు చేసే అవకాశమే లేదు. ప్రయాణికులు బిల్లు అడుతారు కాబట్టి ఆహార పదార్థాలకు ఏ ధర ఫిక్స్ చేశారో అంతే తీసుకుంటారు. ఒకవేళ అమ్మకందారులు మీకు బిల్లు ఇవ్వకపోతే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, మీరు ఉచితంగానే ఫుడ్ తీసుకోవచ్చని భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ ప్రకటిస్తున్నాయి. ఈ ప్రకటన బాగానే ఉంది కానీ... ఇది ఎంతవరకు సరిగ్గా అమలవుతుందో చూడాలి.

  ఇవి కూడా చదవండి:

  EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇలా మోసపోవచ్చు జాగ్రత్త

  March Bank Holidays: మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ప్లాన్ చేసుకోండి ఇలా

  Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Food, Food prices, Indian Railway, Indian Railways, Irctc, Rail, Railway station, Railways, Train

  ఉత్తమ కథలు