తేజస్ ఎక్స్‌ప్రెస్... ఇండియన్ రైల్వేస్ నడుపుతున్న తొలి ప్రైవేట్ రైలు ఇది. భారతీయ రైల్వే మొదటి ప్రైవేట్ రైలును నడిపే బాధ్యతను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC తీసుకుంది. అక్టోబర్ 5న ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అంటే నెల రోజులుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తోంది. అక్టోబర్ నెలలో తేజస్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల అమ్మకం ద్వారా ఐఆర్‌సీటీసీకి రూ.3.70 కోట్ల ఆదాయం రాగా రూ.70 లక్షల లాభం వచ్చింది. తొలి ప్రైవేట్ రైలు శుభారంభాన్ని ఇచ్చినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. లక్నో-ఢిల్లీ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5 నుంచి ప్రయాణికులకు సేవల్ని అందిస్తోంది. సుమారు 80-85 శాతం యావరేజ్ ఆక్యుపెన్సీ రేషియోతో రైలు నడుస్తోంది. అంటే... రైలులో సగటును 80-85 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. వారానికి 6 రోజులు మాత్రమే నడిచే ఈ రైలుకు అక్టోబర్ 5 నుంచి 28 వరకు ఐఆర్‌సీటీసీకి అయిన ఖర్చు రూ.3 కోట్లు. అంటే సగటున రోజుకు రూ.14 లక్షలు ఖర్చు పెట్టింది. టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.17.50 లక్షలు ఆర్జించింది.
ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. ప్రయాణికులకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించేలా రైలును తీర్చిదిద్దారు. రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా రూ.25 లక్షల ప్రమాద బీమాతో పాటు ఇంట్లోని వస్తువులకు కూడా రూ.1 లక్ష బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు పికప్ సర్వీస్‌తో పాటు రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్ బ్యాక్, నామినల్ క్యాన్సలేషన్ ఛార్జెస్ లాంటి సేవలు ఉన్నాయి. సాధారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నవే. అయితే తేజస్ ఎక్స్‌ప్రెస్ గంట ఆలస్యంగా నడిస్తే రూ.100, రెండు గంటలు ఆలస్యంగా నడిస్తే రూ.250 నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది ఐఆర్‌సీటీసీ.
Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
EPFO UAN: ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ జనరేట్ చేయండి ఇలా
Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, Irctc, New Delhi railway station, Rail, Railways, Tejas train