IRCTC: అక్టోబర్ 4న తొలి ప్రైవేట్ రైలు ప్రారంభం... ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా
IRCTC Tejas Express | ఇతర రైళ్లల్లో ప్రయాణికులకు కన్సెషన్, కోటాలు ఉన్నట్టు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండవు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారికి రూ.25 లక్షల రైల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉచితంగా లభిస్తుంది.
news18-telugu
Updated: September 17, 2019, 11:24 AM IST

IRCTC: అక్టోబర్ 4న తొలి ప్రైవేట్ రైలు ప్రారంభం... ప్రయాణికులకు రూ.25 లక్షల ఉచిత ప్రయాణ బీమా (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: September 17, 2019, 11:24 AM IST
భారతీయ రైల్వేకు చెందిన తొలి ప్రైవేట్ రైలు అక్టోబర్ 4న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ లక్నో-ఢిల్లీ మధ్య ప్రయాణించే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మొదటి ప్రైవేట్ రైలును నడిపే బాధ్యతను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC సంస్థకు అప్పగించింది ఇండియన్ రైల్వేస్. అక్టోబర్ 4 నుంచి లక్నో-ఢిల్లీ మధ్య తొలి ప్రైవేట్ రైలు పరుగులు తీయనుంది. ఢిల్లీ నుంచి లక్నోకు అదే రోజున ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మరుసటి రోజు లక్నో నుంచి ఢిల్లీ మధ్య కమర్షియల్ రన్ మొదలవుతుంది. షెడ్యూల్ ప్రకారం లక్నోలో ఉదయం 6:10 గంటలకు బయల్దేరే తేజస్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12:25 గంటలకు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. మధ్యలో కాన్పూర్, ఘజియాబాద్‌లో మాత్రమే రైలు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో సాయంత్రం 04:30 గంటలకు తేజస్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరి రాత్రి 10:45 గంటలకు లక్నోకు చేరుకుంటుంది. మంగళవారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు ఈ రైలు సేవలు అందిస్తుంది.
తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలనుకునేవారి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ https://irctc.co.in లేదా మొబైల్ యాప్‌లోనే టికెట్లు బుక్ చేయాలి. రైల్వేస్టేషన్‌లోని కౌంటర్లలో టికెట్ లభించదు. 60 రోజుల ముందుగానే బెర్త్ రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ధరలు ఎంత ఉంటాయన్న స్పష్టత ఇంకా ఇవ్వలేదు ఐఆర్సీటీసీ. ఢిల్లీ-లక్నో మధ్య ఉన్న ఫ్లైట్ ఛార్జీల్లో 50% లోపే తేజస్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు ఉంటాయన్న వార్తలొస్తున్నాయి. ఎయిర్‌లైన్ తరహాలో ఛార్జీల విధానం ఉంటుందని తెలుస్తోంది. అంటే ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో ఎప్పుడూ ఛార్జీలు ఒకేలా ఉండవు. రోజుకో ఫేర్ కనిపిస్తుంది. ఛార్జీలు గంటగంటకు మారుతుంటాయి. ఐఆర్సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇలాంటి డైనమిక్ ప్రైసింగ్ ఉంటుందని అంచనా. ఇతర రైళ్లల్లో ప్రయాణికులకు కన్సెషన్, కోటాలు ఉన్నట్టు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండవు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారికి రూ.25 లక్షల రైల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉచితంగా లభిస్తుంది.
ఇక తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారికి ప్రత్యేకమైన సేవలు అందనున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు హోటల్ బుకింగ్స్, ట్యాక్సీ, బ్యాగేజ్ పికప్ అండ్ డ్రాప్ లాంటి సేవలతో పాటు అవసరమైనవారికి వీల్ ఛైర్లను కూడా అందించనుంది ఐఆర్సీటీసీ. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఓ గంట కన్నా ఎక్కువ ఆలస్యంగా గమ్యస్థానానికి చేరితే ప్రయాణికులకు నష్టపరిహారం కూడా ఉందుతుంది. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఫ్లైట్‌లో లాగానే ప్రయాణికులకు మీల్స్ సర్వీస్ కూడా ఉంటుంది. టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ లాంటివి ఉంటాయి. ప్రతీ కోచ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి. ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ సక్సెస్ అయిన తర్వాత ముంబై-అహ్మదాబాద్ రూట్లో ఈ రైలు ద్వారా సేవల్ని అందించనుంది ఐఆర్సీటీసీ.Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
IRCTC: షిరిడీ వెళ్లాలనుకునేవారికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీIRCTC: రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయండి ఇలా...
IRCTC Scheme: స్లీపర్ క్లాస్ రైలు టికెట్‌తో ఏసీలో జర్నీ... ఆ స్కీమ్ ఇదే

గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?
Railway Jobs: రైల్వేలో 296 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
RRB NTPC Exam: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?
IRCTC Sabarimala Tour: ఐఆర్సీటీసీ శబరిమల టూర్... ప్యాకేజీ రూ.2,990 మాత్రమే
Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 జాబ్స్... ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉద్యోగాలు
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు