కరోనే ఉధృతి నేపథ్యంలో డిమాండ్ తగ్గడంతో అనేక మార్గాల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అయితే రద్దీ పెరుగుతున్న మార్గాల్లో ట్రైన్ల సంఖ్యను పెంచుతున్న రైల్వే.. రద్దీ తక్కువగా ఉన్న మార్గాల్లో తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ నుంచి త్రిపుర రాజధాని అగర్తల వరకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 21, 28 తేదీల్లో ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి రెండు ట్రిప్పులు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ రెండు తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఆగర్తలకు ట్రైన్ బయలు దేరుతుందని రైల్వే వర్గాలు తెలిపారు. శుక్రవారం తిరిగి ఆగర్తల నుంచి సికింద్రాబాద్ కు ఆ ట్రైన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో రైళ్ల సర్వీసులను తిరిగి పెంచేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు ప్రారంభం.. పూర్తి సమాచారం తెలుసుకోండి.. South Central Railway: టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం..? ఇది ఎంత వరకు నిజం..!
డిమాండ్ పెరగడంతో జూన్ నెలలో మరో 660 రైళ్లను నడిపేందుకు ఇండియన్ రైల్వే నిర్ణయించింది. వలస కూలీలు, ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. జోన్ల వారీగా ఉన్న ప్రయాణికుల వెయిటింగ్ లిస్టును తగ్గించడానికి అదనపు రైళ్లను నడపడానికి రైల్వే యత్నిస్తోంది. ఇదిలా ఉంటే రద్దీ లేకపోవడంతో మరో ఆరు స్పెషల్ ట్రైన్స్ ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ ట్రైన్లు ఈ నెల 21-22 తేదీల నుంచి ఈ నెల 30, జూలై 1 వరకు రద్దు చేసినట్లు వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.