Home /News /business /

INDIAN RAILWAYS CONSIDERS PRIVATISATION OF 90 RAILWAY STATIONS PRIVATE COMPANIES MAY OPERATE STATIONS IN A PPP MODEL SS

Railway Station: దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ... ప్రయాణికుల నుంచి అదనంగా ఛార్జీలు

Railway Station: దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ... ప్రయాణికుల నుంచి అదనంగా ఛార్జీలు
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Station: దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ... ప్రయాణికుల నుంచి అదనంగా ఛార్జీలు (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. త్వరలో మీరు ప్రయాణించడానికి వెళ్లే రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనుంది.

    దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు హిందుస్తాన్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది. ఆ కథనం ప్రకారం రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా మౌలిక వసతులు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ ఆలోచన చేస్తోంది. ఇందుకోసం 90 రైల్వే స్టేషన్లను నిర్వహించేందుకు ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించాలని భావిస్తోంది. తమ ముందు గల మార్గాలను భారతీయ రైల్వే అన్వేషిస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ గురించి ఆలోచిస్తోంది భారతీయ రైల్వే.

    ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-IRSDC ముందుండి రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ పనుల్ని చూస్తోంది. దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లలో భద్రతాపరమైన వసతులు ఎలా కల్పించాలో సూచించాలంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-RPF, అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్స్ నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF బలగాలు ఉన్నట్టు రైల్వే స్టేషన్లలో కూడా సీఐఎస్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు అభిప్రాయాన్ని కోరింది. ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రైల్వే స్టేషన్లలో సీఐఎస్ఎఫ్ బలగాలకు ఆయా సంస్థలే వేతనాలు చెల్లిస్తాయి.

    Indian Railways: లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ఈ సర్వీస్ ప్రారంభించిన భారతీయ రైల్వే

    IRCTC Tirupathi Tour: భక్తులకు శుభవార్త... తిరుమల ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... శ్రీవారి దర్శనం కూడా

    ఎయిర్‌పోర్టులో భద్రత కోసం ఎయిర్‌పోర్ట్ నిర్వహించే సంస్థలు ఖర్చు చేస్తున్నట్టు, రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు ఓ ప్రతిపాదన చేసింది. అంటే కేవలం రైల్వే స్టేషన్‌లో వసతులు, భద్రత ఏర్పాట్లు మాత్రమే ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంటాయి. రైల్వే ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించరు. స్టేషన్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్-SFM ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేటాయింపు, పరికరాలు, నిర్వహణ అప్పగించాలని, మ్యాన్‌పవర్ ఖర్చు కూడా ఆ సంస్థ భరించాలన్నది మరో ప్రతిపాదన. ఇలాంటి ప్రతిపాదనలపై అభిప్రాయాలు మార్చి 15 లోగా తెలపాలంటూ రైల్వే బోర్డు కోరింది.

    ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. 2019 నుంచి ఇదే విషయమై ఆలోచిస్తోంది భారతీయ రైల్వే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్-PPP పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలు రైల్వే స్టేషన్లను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను 2019 లోనే తెరపైకి తీసుకొచ్చింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని 2019 అక్టోబర్‌లోనే ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక తిరుపతి, నెల్లూరు, నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్‌సర్, సబర్మతి, పుదుచ్చెరి, డెహ్రడూన్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ప్రాసెస్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో బిడ్డింగ్ మొదలుపెట్టింది భారతీయ రైల్వే. మరోవైపు గాంధీనగర్, హబీబ్‌గంజ్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్టులు కూడా ఇచ్చారు.

    RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు ఫ్రీ వైఫై... ఆ తర్వాత ఎంత చెల్లించాలంటే

    IRCTC Luxury Train: టూరిస్టులకు గుడ్ న్యూస్... మార్చి 14న ఈ లగ్జరీ రైలు సేవలు ప్రారంభం

    ఇలా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో రైలు ఛార్జీలతో పాటు అదనంగా ఫీజు వసూలు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. అంటే ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తున్నట్టు, రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి ఫీజు ఉండబోతోంది. మరోవైపు ప్రైవేట్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తోంది రైల్వే. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి 12 ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కుతాయి. 2027 నాటికి ఈ సంఖ్య 151 చేరుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways, Train, Train tickets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు