Indian Railways: ఈ రిజర్వేషన్ రూల్స్ మారాయి... మీకు తెలుసా?

Indian Railways | మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మహిళలకు 6 స్లీపర్ బెర్తులు రిజర్వ్ చేశారు. గరీబ్ రథ్‌తో పాటు అన్ని రైళ్లల్లో 3ఏసీ బెర్తుల్లో కూడా మహిళలకు 6 సీట్లు రిజర్వై ఉంటాయి.

news18-telugu
Updated: April 14, 2019, 7:52 PM IST
Indian Railways: ఈ రిజర్వేషన్ రూల్స్ మారాయి... మీకు తెలుసా?
Indian Railways: ఈ రిజర్వేషన్ రూల్స్ మారాయి... మీకు తెలుసా?
news18-telugu
Updated: April 14, 2019, 7:52 PM IST
వేసవి సెలవుల్లో ఊరెళ్లేందుకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? సమ్మర్ వెకేషన్ కోసం రిజర్వేషన్ చేయిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం. ఇటీవల మారిన ఈ రిజర్వేషన్ రూల్స్ మీకు తెలుసా? కొత్త రూల్స్ తెలుసుకొని రిజర్వేషన్ చేయించుకుంటే మంచిది. మహిళా ప్రయాణికుల కోసం రైల్వే కొన్ని నిబంధనల్ని మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఏసీ రైళ్లలో మహిళల కోటాలో రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్యను నాలుగు నుంచి ఆరుకు పెంచింది రైల్వే. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో మహిళలకు 6 స్లీపర్ బెర్తులు రిజర్వ్ చేశారు. గరీబ్ రథ్‌తో పాటు అన్ని రైళ్లల్లో 3ఏసీ బెర్తుల్లో కూడా మహిళలకు 6 సీట్లు రిజర్వై ఉంటాయి.

Read this: Election 2019: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి

వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరికీ 6 బెర్తులకు కోటా పెంచడం విశేషం. రాజధాని, దురంతో రైళ్లతో పాటు అన్ని ఏసీ రైళ్లకు ఇది వర్తిస్తుంది. అంతే కాదు వృద్ధులు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణీలకు గతంలో 3 లోయర్ బెర్తులుంటే మరొకటి పెంచారు. అంటే 4 లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే 58 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలకు బేసిక్ ఫేర్‌లో 50 శాతం తగ్గింపు ఇస్తోంది రైల్వే.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులేఇవి కూడా చదవండి:

Honor Gala Festival: హానర్ గాలా ఫెస్టివల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు
Loading...
JIO Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూస్తారా? రూ.200 లోపు జియో ప్లాన్స్ ఇవే...

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...