దూరప్రాంతాలకు వెళ్లేవారు రైలు ప్రయాణం చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పగలు జర్నీ చేస్తే రోజు మొత్తం రైలులోనే గడిచిపోతుంది. సమయం చాలా వృథా అవుతుంది. అదే రాత్రి ప్రయాణం చేస్తే రైలులో నిద్రపోవచ్చు. తెల్లారేసరికి గమ్యస్థానానికి చేరుకోవచ్చు అన్న ఆలోచన రైల్వే ప్రయాణికుల్లో ఉంటుంది. మరి మీరు కూడా ఎక్కువగా రాత్రి వేళలో రైళ్లల్లో ప్రయాణిస్తుంటారా? అయితే భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం కొన్ని నియమనిబంధనల్ని రూపొందించింది. రద్దీని నియంత్రించడానికి, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిబంధనల్ని (Night Journey Rules) అమలు చేస్తోంది రైల్వే. ఈ రూల్స్ పాటించడంలో ప్రయాణికులు విఫలమైతే అది తీవ్రమైన పరిణామాలకు దారి తీయొచ్చు.
రాత్రిపూట ప్రయాణించే రైల్వే ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత తమ మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వినడం, కాల్స్ చేయడం, శబ్దం చేయడం, గట్టిగా మాట్లాడటం లాంటివి చేయకూడదు. రాత్రి 10 గంటల తర్వాత రైలు లైట్లు తప్ప మరే ఇతర లైట్లను వెలిగించకూడదు. రాత్రి 10 గంటల తర్వాత గుంపుగా చేరి ముచ్చట్లు పెట్టి ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలిగించకూడదు. తోటి ప్రయాణీకులకు అసౌకర్యం లేదా హాని కలిగించే ధూమపానం లేదా మద్యం సేవించడం లేదా ఏదైనా ఇతర కార్యకలాపాలలో పాల్గొనడం నిషేధం.
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు షాక్... లబ్ధిదారులు తగ్గిపోతున్నారు
ఇక రైల్వే ప్రయాణికులు రైలులో మండే వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరు. ఈ నిబంధనలను పాటించేలా సహకరించాలని భారతీయ రైల్వే ప్రయాణికుల్ని కోరుతోంది. ఇక ప్రయాణికులు ఈ రూల్స్ పాటించేలా చూడాలని టీటీఈలు, ఆన్‌బోర్డ్ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను రైల్వే ఆదేశించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచేలా రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. అంటే మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ బెర్త్ తెరిచి అందులో నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిడిల్ బెర్త్ క్లోజ్ చేసి లోయర్ బెర్త్‌లో కూర్చోవచ్చు.
ఇక రాత్రి 10 గంటల తర్వాత రైలులో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అందుబాటులో ఉండదన్న విషయం ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. రైలులో ప్రతీ ఒక్కరికీ ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించడం చాలా అవసరం.
Aadhaar Card: మీ ఆధార్‌లో ఈ వివరాలు అప్‌డేట్ చేశారా? వెంటనే చేయండిలా
భారతీయ రైల్వే తన ప్రయాణికులకు ఉత్తమమైన సేల్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అందులో భాగంగానే రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ నిబంధనల్ని రూపొందించింది. రైల్వే ప్రయాణికులు కూడా అందుకు సహకరించాలని రైల్వే కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways