శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. భారతీయ రైల్వే (Indian Railways) దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లను (Sabarimala Special Trains) ప్రకటిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 07117 సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 8, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
రైలు నెంబర్ 07118 కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 10, 17 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం రాత్రి 11.20 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Sabarimala: శబరిమల భక్తులకు శుభవార్త... నిమిషానికి ఓ బస్సు నడపనున్న కేరళ ఆర్టీసీ
Sabarimala Special Trains@drmvijayawada @drmgtl @drmgnt #sabarimala #SpecialTrains pic.twitter.com/0Zdgif95c9
— South Central Railway (@SCRailwayIndia) November 9, 2022
సికింద్రాబాద్-కొట్టాయం రూట్లో నడిచే శబరిమల ప్రత్యేక రైళ్లు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప , రాజంపేట, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పొడనూర్, పాలక్కాడ్, షొరనూర్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.
రైలు నెంబర్ 07119 నర్సాపురం నుంచి కొట్టాయంకు నవంబర్ 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి శనివారం తెల్లవారుజామున 3.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
రైలు నెంబర్ 07120 కొట్టాయం నుంచి నర్సాపూర్ రూట్లో నవంబర్ 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శనివారం రాత్రి 10.50 గంటలకు కొట్టాయంలో బయల్దేరి ఆదివారం సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
నర్సాపూర్-కొట్టాయం రూట్లో నడిచే ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ , తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు , గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి.
Sabarimala Virtual-Q: అయ్యప్ప భక్తులకు అలర్ట్... శబరిమల వర్చువల్ క్యూ లైన్ బుకింగ్ ప్రారంభం
భారతీయ రైల్వే శబరిమల అయ్యప్ప భక్తుల కోసం ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ ప్రారంభమైంది. అయ్యప్ప భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayyappa devotees, Indian Railways, IRCTC, Sabarimala, Sabarimala Temple, Special Trains