HOME »NEWS »BUSINESS »indian railways announced 40 clone special trains check routes and other details here ss

Special Trains: ప్రయాణికులకు గమనిక... మరో 40 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే... లిస్ట్ ఇదే

Special Trains: ప్రయాణికులకు గమనిక... మరో 40 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే... లిస్ట్ ఇదే
Special Trains: ప్రయాణికులకు గమనిక... మరో 40 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే... లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Special Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే మరో 40 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఆ రైళ్లు ఏ రూట్లలో నడుస్తాయో తెలుసుకోండి.

  • Share this:
    రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే మరో 40 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్ల సంఖ్య 350 కి చేరుకోనుంది. ఇప్పటికే మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని ట్రైన్స్, జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, సెప్టెంబర్ 12 నుంచి 80 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో 40 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. తాజాగా ప్రకటించిన 40 స్పెషల్ ట్రైన్స్ 2020 సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిని క్లోన్ స్పెషల్ ట్రైన్స్ అని తెలిపింది రైల్వే. అంటే ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రూట్లలో కొన్ని రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో మాత్రమే కొత్తగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే.

    Special Trains: ప్రత్యేక రైళ్లకు ప్రారంభమైన బుకింగ్... టికెట్లు తీసుకోండి ఇలా



    EMI Moratorium: వాయిదా వేసిన ఈఎంఐ కట్టడానికి 4 ఆప్షన్స్


    ఇవన్నీ రిజర్వ్‌డ్ ట్రైన్సే. అంటే ప్రయాణికులు టికెట్లు ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఈ రైళ్లకు 10 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్టేషన్లలో మాత్రమే స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి. భారతీయ రైల్వే కొత్తగా ప్రకటించిన 40 రైళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. ఆ రైళ్ల వివరాలు ఇవే.

    రైలు నెంబర్ 02787 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ప్రతీ రోజూ ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. ఇక రైలు నెంబర్ 02788 దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది.

    రైలు నెంబర్ 06509 బెంగళూరు నుంచి దానాపూర్ ఉదయం 8 గంటలకు బయల్దేరుతుంది. రైలు నెంబర్ 06510 దానాపూర్ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బెంగళూరు బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు విజయవాడ, వరంగల్ విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
    Published by:Santhosh Kumar S
    First published:September 16, 2020, 09:20 IST