Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ కార్డ్ రీఛార్జ్

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ కార్డ్ రీఛార్జ్ (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | ఇండియన్ రైల్వేస్ మరో సర్వీస్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణికులు స్మార్ట్ కార్డుల్ని ఇక ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు మరిన్ని సేవల్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రైల్వే. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగించే స్మార్ట్ కార్డుల్ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందుకోసం యూజర్లు UTSonmobile వెబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్మార్ట్ కార్డుల్ని ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్ చేయొచ్చు. భారతీయ రైల్వే డిజిటలైజేషన్‌లో భాగంగా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా కొనే సదుపాయాన్ని ప్రారంభించింది. ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా టికెట్లు తీసుకోవచ్చు.

    Gold Loan: గోల్డ్ లోన్ కావాలా? వడ్డీ 79 పైసలు మాత్రమే

    ATM New Rule: ఏటీఎంలో డబ్బులు లేవా? రూ.10,000 ఫైన్ చెల్లించనున్న బ్యాంకులు

    స్మార్ట్ కార్డుల ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ కార్డుల్ని ఇకపై ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవచ్చు. గతంలో అయితే రైల్వే ప్రయాణికులు స్మార్ట్ కార్డులో బ్యాలెన్స్ ఖాళీ అయితే బుకింగ్ కౌంటర్ల దగ్గర రీఛార్జ్ చేసేవారు. ఇప్పుడు రైల్వే కౌంటర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. యూపీఐ, డెబిట్ కార్డుల్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే స్మార్ట్ కార్డుల్ని రీఛార్జ్ చేయొచ్చు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

    PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

    PM Ujjwala Scheme 2.0: ఉచితంగా గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్... అప్లై చేయండి ఇలా

    ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించేందుకు ముందుగా https://www.utsonmobile.indianrail.gov.in./ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో తమ వివరాలతో రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మెనూలో SMART CARD RECHARGE ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ మొత్తాన్ని ఎంటర్ చేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి. ఈ స్టెప్స్‌తో స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: