Home /News /business /

INDIAN RAILWAYS ALERTS RAILWAY PASSENGERS TO NOT TO RESPOND CALLS OR MESSAGES REGARDING TICKET REFUND SS

IRCTC Alert: ఐఆర్‌సీటీసీ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్

IRCTC Alert: ఐఆర్‌సీటీసీ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్
(ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Alert: ఐఆర్‌సీటీసీ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Alert | భారతీయ రైల్వే ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తోంది. రైలు టికెట్లు క్యాన్సిల్ చేసి (Train Ticket Cancellation) రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది.

ఇటీవల రైలు టికెట్లు బుక్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారా? మీ ప్రయాణం వాయిదా పడటంతో ట్రైన్ టికెట్ క్యాన్సిల్ (Train Ticket Cancellation) చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే అలర్ట్. రైలు టికెట్ల రీఫండ్ (Train Ticket Refund) కోసం ఎదురుచూస్తున్నవారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. రీఫండ్ రావాల్సిన ప్రయాణికులకు లింక్స్ పంపుతూ, కాల్స్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం భారతీయ రైల్వే దృష్టికి వచ్చింది. రైల్వే ప్రయాణికుల సందేహాలు తీర్చేందుకు, సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన రైల్వే సేవా ప్లాట్‌ఫామ్ ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తోంది. ఎలాంటి అనుమానాస్పద లింక్స్‌కు, కాల్స్‌కు రెస్పాండ్ కావొద్దని, అది ఆర్థికపరమైన మోసాలకు దారితీయొచ్చని హెచ్చరిస్తోంది.

ఐఆర్‌సీటీసీ నుంచి రైలు టికెట్ల క్యాన్సలేషన్‌కు సంబంధించిన రీఫండ్ రావాల్సిన ప్రయాణికులకు సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్స్, లింక్స్ వెళ్తున్నాయి. లింక్స్ క్లిక్ చేస్తే రీఫండ్ వస్తుందని, ఫోన్ కాల్‌లో తాము అడిగిన వివరాలు చెబితే రీఫండ్ పొందొచ్చని నమ్మిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ రీఫండ్ ప్రాసెస్ పూర్తిగా ఆటోమెటిక్‌గా ఉంటుంది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి లింక్స్ లేదా కాల్స్‌కు అస్సలు స్పందించకూడదు.

Jio 3GB Data Plans: రోజూ 3జీబీ డేటా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... జియో ప్లాన్స్ ఇవే


తమకు ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయంటూ రైల్వే ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా భారతీయ రైల్వేను అప్రమత్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు వెంటనే ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నారు. వాట్సప్‌లో లింక్స్ వస్తున్నాయని, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి రీఫండ్ పొందాలని అడుగుతున్నట్టు ప్రయాణికులు వివరించారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తోంది రైల్వే.

రైల్వే సేవా మాత్రమే కాదు, ఐఆర్‌సీటీసీ కూడా ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా కాల్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, పాన్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలు అడిగితే స్పందించకూడదని, ఎనీడెస్క్, టీమ్‌వ్యూయర్ లాంటి యాప్స్‌ని స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయమంటే చేయకూడదని ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది.

IRCTC Cruise Tour: కేరళ వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ క్రూజ్ టూర్ ప్యాకేజీ మీకోసమే



ఐఆర్‌సీటీసీ రీఫండ్ వివరాలు చూస్తే రైలు టికెట్స్ క్యాన్సిల్ చేసిన మూడు రోజుల్లోనే రీఫండ్ అకౌంట్స్‌కి వస్తుంది. ఒకవేళ రీఫండ్ రాకపోతే ఐఆర్‌సీటీసీ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్లకు రూ.240, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ క్లాస్ టికెట్లకు రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్, ఏసీ 3 ఎకానమీ టికెట్లకు రూ.180, స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.120, సెకండ్ క్లాస్ టికెట్లకు రూ.60 చొప్పున ఛార్జీలు డిడక్ట్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ. రైలు బయల్దేరడానికి 48 గంటల నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే 25 శాతం ఛార్జీలు, 12 గంటల నుంచి 4 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే 50 శాతం ఛార్జీలు చెల్లించాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, Railways, Special Trains, Train tickets

తదుపరి వార్తలు