హోమ్ /వార్తలు /బిజినెస్ /

IRCTC Kashi Mahakal Express: శివరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రైలు ప్రారంభం

IRCTC Kashi Mahakal Express: శివరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రైలు ప్రారంభం

ఢిల్లీ నుంచి బెంగళూరు స్పెషల్ ట్రైన్‌లో వెళ్లిన 50 మంది ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండేందుకు నిరాకరించడంతో IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.

ఢిల్లీ నుంచి బెంగళూరు స్పెషల్ ట్రైన్‌లో వెళ్లిన 50 మంది ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండేందుకు నిరాకరించడంతో IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.

IRCTC Kashi Mahakal Express | భారతీయ రైల్వే నుంచి మూడో ప్రైవేట్ రైలు పట్టాలెక్కుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఐఆర్‌సీటీసీ కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభిస్తోంది.

  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC మూడో ప్రైవేట్ రైలును ప్రకటించింది. ఇప్పటికే తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో రెండు ప్రైవేట్ రైళ్లు నడుస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా 3వ ప్రైవేట్ రైలును ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఇండోర్-వారణాసి రూట్‌లో ఈ ప్రైవేట్ రైలు సేవలు అందించనుంది. మొదటి రెండు ప్రైవేట్ రైళ్లకు తేజస్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెడితే, ఇండోర్ వారణాసి మధ్య నడిచే ప్రైవేట్ రైలుకు 'కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్' అని నామకరణం చేసింది ఐఆర్‌సీటీసీ. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 20న కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తోంది ఐఆర్‌సీటీసీ. వారంలో మూడు రోజులు కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. రాత్రంతా ప్రయాణించే తొలి ప్రైవేట్ రైలు ఇదే. వారణాసికి రాకపోకలు సాగించే మొదటి ప్రైవేట్ రైలు కూడా ఇదే.

  ఐఆర్‌సీటీసీ 'కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్' రైలులో అన్నీ ఏసీ కోచ్‌లే ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు, ఎల్ఈడీ లైట్లు, సీసీటీవీ కెమెరాల్లాంటి అత్యాధునిక హంగులు ఉంటాయి. ఇప్పటికే నడుస్తున్న ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రైళ్లకు వర్తించే నియమనిబంధనలే 'కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్'‌కు కూడా వర్తిస్తాయి. ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై రూట్లలో ఇప్పటికే ఐఆర్‌సీటీసీ ప్రైవేట్ రైళ్లను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండోర్-వారణాసి రూట్‌లో ప్రారంభమయ్యే 'కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్'‌తో దేశంలో ప్రైవేట్ రైళ్ల సంఖ్య మూడుకు చేరుకుంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా 150 ప్రైవేట్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.

  ఇవి కూడా చదవండి:

  IRCTC Tour: ఐఆర్‌సీటీసీ నుంచి అరకు, సింహాచలం టూర్ ప్యాకేజీ

  IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్... 'వాలెంటైన్స్ డే టూర్' తీసుకెళ్తున్న ఐఆర్‌సీటీసీ

  Save Money: జీతం మిగలట్లేదా? ఈ మనీ సేవింగ్ టిప్స్ ట్రై చేయండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways, Varanasi

  ఉత్తమ కథలు