Indian Railways: గుడ్ న్యూస్... రైళ్లల్లో జనరల్ టికెట్లకూ సీట్లు కన్ఫామ్

Indian Railways | మీరు రైలు ఎక్కగానే మీకు కేటాయించిన సీటులో కూర్చోవచ్చు. ప్లాట్‌ఫామ్‌పై క్యూ తగ్గించడంతో పాటు, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని రూపొందించింది.

news18-telugu
Updated: December 3, 2019, 4:14 PM IST
Indian Railways: గుడ్ న్యూస్... రైళ్లల్లో జనరల్ టికెట్లకూ సీట్లు కన్ఫామ్
Indian Railways: గుడ్ న్యూస్... రైళ్లల్లో జనరల్ టికెట్లకూ సీట్లు కన్ఫామ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు తరచూ రైళ్లల్లో ప్రయాణిస్తుంటారా? జనరల్ బోగీల్లో వెళ్తుంటారా? జనరల్ బోగీల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటారా? ఇకపై మీకు ఆ సమస్య ఉండదు. మీరు జనరల్ టికెట్లు తీసుకున్నా మీకు సీటు కన్ఫామ్ అవుతుంది. భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త సర్వీస్ ఇది. జనరల్ కంపార్ట్‌మెంట్ టికెట్లు తీసుకున్నవారికి కూడా కన్ఫామ్డ్ టికెట్లు ఇచ్చేందుకు భారతీయ రైల్వే ఈ సర్వీస్ ప్రారంభించింది. మీరు టికెట్ తీసుకోగానే సీటు ఫోటో మీ వాట్సప్‌కు వస్తుంది. మీరు రైలు ఎక్కగానే మీకు కేటాయించిన సీటులో కూర్చోవచ్చు. ప్లాట్‌ఫామ్‌పై క్యూ తగ్గించడంతో పాటు, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని రూపొందించింది.

'పాస్ ఫర్ అన్‌రివార్డెడ్ బోర్డ్-PURB' పేరుతో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో దానాపూర్ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది భారతీయ రైల్వే. ఇక్కడ కొంతకాలం పరిశీలించిన తర్వాత సక్సెస్ అయితే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సర్వీస్‌ను అమలు చేస్తుంది. అదే జరిగితే జనరల్ కోచ్‌లల్లో అన్‌రిజర్వ్‌డ్ సీట్లను కూడా కన్ఫామ్ చేసి ప్రయాణికులకు అందిస్తుంది.

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

IRCTC Tatkal Booking: ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ

IRCTC Tour: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్... తక్కువ ధరకే పూరీ, గయ టూర్ ప్యాకేజీIRCTC Tirupathi Tour: ఐఆర్‌సీటీసీ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీ... ధర తక్కువే
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>