Indian Railways : నో బిల్.. నో పేమెంట్... కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే... ప్రయాణికులకు మేలు...

Indian Railways : రైల్వేలో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం... కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లు, ప్లాట్‌ఫాంలపై ఎవరు ఏది అమ్మినా బిల్ ఇవ్వాల్సిందే. బిల్లు ఇవ్వకపోతే, ఆ వస్తువుకు ప్రయాణికులు డబ్బు చెల్లించాల్సిన పనిలేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 19, 2019, 11:52 AM IST
Indian Railways : నో బిల్.. నో పేమెంట్... కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే... ప్రయాణికులకు మేలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
No Bill.. No Payment : మన దేశ రాజ్యాంగం ప్రకారం... రూపాయి విలువ చేసే ఏ వస్తువు కొన్నా... దానికి బిల్ ఇవ్వాల్సిందే. కానీ చాలా మంది బిల్లులు ఇవ్వట్లేదు. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న కేంద్ర ప్రభుత్వం అక్రమాల దుమ్ము దులుపుతోంది. ముఖ్యంగా ఇండియన్ రైల్వేలో... పూర్తి పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్న రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్... కొత్త ప్రకటన చేశారు. ఇకపై ప్రయాణికులు రైళ్లలో కానీ, కేటరింగ్‌లో గానీ, ప్లాట్‌ఫాంపై గానీ... ఏదైనా వస్తువు కొన్నప్పుడు... అమ్మకందారు దానికి కచ్చితంగా బిల్ ఇవ్వాల్సిందే. బిల్ ఇవ్వడానికి తిరస్కరిస్తే... ప్రయాణికుడు ఆ వస్తువుకి డబ్బు చెల్లించాల్సిన పని లేదు. ఈ విషయంలో కోర్టుకి వెళ్లినా... ప్రయాణికుడికే అనుకూలంగా తీర్పు వస్తుంది. దీనికి పియూష్ గోయల్... నో బిల్, నో పేమెంట్ పాలసీ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు.




ప్రయాణికులకు మేలు : ఈ పాలసీ ప్రయాణికులకు మేలు చేస్తుంది. దీని వల్ల వస్తువు MRP ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మకందారు అమ్మే అవకాశం ఉండదు. ఆ బిల్లులు కూడా అల్లాటప్పావి కావు. POS యంత్రంతో ప్రింట్ చేసిన బిల్లులు. కాబట్టి... వాటికి పూర్తి చట్టబద్ధత ఉంటుంది.బిల్లు ఇవ్వకపోతే ప్రయాణికులు ఊరుకోవడానికి వీల్లేదు. కచ్చితంగా బిల్లు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా ట్వీట్ చేశారు పియూష్ గోయల్. ఇప్పటికే POS యంత్రాల సరఫరా జరుగుతోందన్న ఆయన... తన ట్వీట్ ద్వారా రైల్వేల్లో పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నానన్నారు.
First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>