హోమ్ /వార్తలు /బిజినెస్ /

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 200లకు పైగా రైళ్లు రద్దు.. లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 200లకు పైగా రైళ్లు రద్దు.. లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివిధ కారణాలతో భారతీయ రైల్వే ఈ రోజు అంటే డిసెంబర్ 10న అనేక రైళ్లను రద్దు చేసింది. ఇది కాకుండా, చాలా రైళ్లను దారి మళ్లించింది. చాలా రైళ్ల షెడ్యూల్‌ను సైతం మార్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi | Hyderabad

వివిధ కారణాలతో భారతీయ రైల్వే (Indian Railways) ఈ రోజు అంటే డిసెంబర్ 10న అనేక రైళ్లను రద్దు (Trains Cancelled) చేసింది. ఇది కాకుండా, చాలా రైళ్లను దారి మళ్లించింది. చాలా రైళ్ల షెడ్యూల్‌ను సైతం మార్చారు. ఇందులో ప్యాసింజర్, మెయిల్, సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. రైళ్లను రద్దు చేయడానికి సరైన కారణాలను రైల్వే శాఖ వెల్లడించలేదు. అయితే, నిర్వహణ పనులు మరియు ఇతర కార్యాచరణ సమస్యల కారణంగా రైళ్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. రైల్వే ఈరోజు 296 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో 58 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఇది కాకుండా, రైల్వే 28 రైళ్లను రీషెడ్యూల్ చేసి దారి మళ్లించింది. ఇందులో 22 రైళ్లను దారి మళ్లించగా, 6 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దారి మళ్లించిన రైళ్లు నిత్యం వెళ్లే స్టేషన్ల నుంచి కాకుండా కొత్త స్టేషన్ల గుండా వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకుంటే.. రద్దు చేయబడిన, దారి మళ్లించిన మరియు రీషెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితాను ముందుగా ఓ సారి తనిఖీ చేసుకోండి.

రద్దు చేయబడిన రైళ్ల జాబితాను ఎలా చూడాలి?

రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన మరియు దారి మళ్లించిన రైళ్ల గురించి సమాచారాన్ని భారతీయ రైల్వే మరియు IRCTC వెబ్‌సైట్ నుండి పొందవచ్చు. రైలు స్థితిని తెలుసుకోవడానికి, ఎవరైనా రైల్వే వెబ్‌సైట్ https://enquiry.indianrail.gov.in/mntes లేదా IRCTC వెబ్‌సైట్ https://www.irctchelp.in/cancelled-trains-list/ లింక్‌ని సందర్శించాలి. #జాబితా2. భారతీయ రైల్వే వెబ్‌సైట్ నుండి రైలు స్థితిని తెలుసుకోవడానికి ఇది మార్గం.

IRCTC Ticket Booking: వాయిస్ మెసేజ్‌తో ట్రైన్ టికెట్ బుకింగ్... స్టెప్స్ ఇవే

ఈ స్టెప్స్ తో రైద్దు చేసిన రైళ్ల జాబితా:

- రైలు స్టేటస్ ను తనిఖీ చేయడానికి enquiry.indianrail.gov.in/mntes/ని సందర్శించండి.

- అనంతరం మీరు captcha నమోదు చేయాలి.

- ఇప్పుడు Exceptional Trains ఆప్షన్ కనిపిస్తుంది.

- Exceptional Trains ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

- ఇక్కడ రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన మరియు దారి మళ్లించిన రైళ్ల ఆప్షన్ కనిపిస్తుంది.

- వీటిని క్లిక్ చేయడం ద్వారా రద్దు చేయబడిన, రీషెడ్యూల్ చేయబడిన మరియు దారి మళ్లించిన రైళ్ల గురించి తెలుసుకోవచ్చు.

First published:

Tags: Indian Railways, South Central Railways, Trains cancel, Trains cancelled

ఉత్తమ కథలు