IRFC IPO: ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి మరో అవకాశం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్-IRFC ఐపీఓ సబ్స్క్రిప్షన్ సోమవారం (2021 జనవరి 18న) ప్రారంభం కానుంది. 2021 లో వస్తున్న మొదటి ఐపీఓ ఇదే కావడం విశేషం. ఒక షేరు ధరను రూ.25-26 గా ఫిక్స్ చేశారు. ఫేస్ వ్యాల్యూ రూ.10. ఒకరు కనీసం 575 ఈక్విటీ షేర్లను కొనాల్సి ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ జనవరి 20న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా గరిష్టంగా రూ.4,633.4 కోట్లు సేకరించనుంది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్-IRFC. ఐపీఓ ద్వారా 1,78,20,69,000 ఈక్విటీ షేర్లలో 1,18,80,46,000 షేర్లు ఫ్రెష్ ఇష్యూ కాగా, 59,40,23,000 షేర్లు భారత ప్రభుత్వానికి చెందిన ఆఫర్ ఫర్ సేల్. 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్కి, 35 శాతం రీటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీకి కేటాయించారు. ఇందులో రూ.50 లక్షల విలువైన షేర్లను అర్హులైన ఉద్యోగులకు కేటాయించారు. ఐఆర్ఎఫ్సీ షేర్లు గ్రే మార్కెట్లో రూ.1.20 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి.
Gold Price: బంగారం ధర రికార్డు పతనం... రూ.8,000 తగ్గిన గోల్డ్ రేట్
ఈ ఐపీఓ ద్వారా సేకరించే డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించనుంది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్-IRFC. ఐఆర్ఎఫ్సీ భారతీయ రైల్వేకు చెందిన అనుబంధ సంస్థ. రైల్వేకు కావాల్సిన పవర్డ్, అన్పవర్డ్ వెహికిల్స్, లోకోమోటీవ్స్, కోచ్లు, వేగన్స్, ట్రక్స్, ఫ్లాట్స్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్, కంటైనర్స్, క్రేన్స్, ట్రాలీస్ లాంటి వాటి కోసం డబ్బును సమకూరుస్తుంది. రైల్వే మౌలిక వసతులకు లీజింగ్ వ్యవహారాలను చూసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI దగ్గర ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్-IRFC 'ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ' కేటగిరీలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్-NBFC పేరుతో రిజిస్టరై ఉంది.
Tags: Indian Railway, Indian Railways, Irctc, Nifty, Railways, Sensex, Share price, Stock Market, Train, Train tickets