IRCTC: స్టాక్ మార్కెట్‌లో ఐఆర్‌సీటీసీ సంచలనాలు... షేర్ ధర ఎంతో తెలుసా?

IRCTC Share Price | ఐఆర్‌సీటీసీ రూ.645 కోట్లు సేకరించాలనుకుంటే ఏకంగా అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర రూ.72,000 బిడ్స్ వచ్చాయి. ఉన్నవి 2 కోట్ల షేర్లే అయినా 225 కోట్ల షేర్లకు బిడ్స్ వేశారు ఇన్వెస్టర్లు.

news18-telugu
Updated: October 14, 2019, 12:54 PM IST
IRCTC: స్టాక్ మార్కెట్‌లో ఐఆర్‌సీటీసీ సంచలనాలు... షేర్ ధర ఎంతో తెలుసా?
IRCTC: స్టాక్ మార్కెట్‌లో ఐఆర్‌సీటీసీ సంచలనాలు... షేర్ ధర ఎంతో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 14, 2019, 12:54 PM IST
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. రూ.320 ధర గల షేర్ బీఎస్ఈలో రూ.644 ధరతో ఓపెన్ అయింది. అంటే ఇన్వెస్టర్లకు ఏకంగా 116.48 శాతం లాభాలను అందించింది. ఇక ఎన్ఎస్‌ఈలో షేర్ ధర రూ.626 దగ్గర ఓపెన్ అయింది. ప్రస్తుతం రూ.710 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఐఆర్‌సీటీసీ ఐపీఓ ప్రకటించిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఐఆర్‌సీటీసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.315-320. కేంద్ర ప్రభుత్వ వాటా 12.6 శాతం తగ్గించి మొత్తం 2 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది ఐఆర్‌సీటీసీ. ఐపీఓ ద్వారా రూ.645 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. ఐఆర్‌సీటీసీ ఐపీఓకు మంచి డిమాండ్ ఉంటుందని మొదటి నుంచి అనుకున్నారు. కానీ ఆ డిమాండ్ ఊహించని స్థాయిలో ఉందని ఐపీఓ దరఖాస్తుకు చివరి రోజు తెలిసింది. ఏకంగా 112 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయింది. అంటే ఐఆర్‌సీటీసీ రూ.645 కోట్లు సేకరించాలనుకుంటే ఏకంగా అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర రూ.72,000 బిడ్స్ వచ్చాయి. ఉన్నవి 2 కోట్ల షేర్లే అయినా 225 కోట్ల షేర్లకు బిడ్స్ వేశారు ఇన్వెస్టర్లు. లిస్టింగ్ రోజు ఐఆర్‌సీటీసీ షేర్ రికార్డులు సృష్టిస్తుందన్న అంచనాలు బాగా పెరిగాయి.

సోమవారం స్టాక్ మార్కెట్‌లో ఐఆర్‌సీటీసీ లిస్ట్ కాగానే రికార్డు ధరలో కనిపించాయి. తరచూ రైలు ప్రయాణం చేసేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC గురించి బాగా తెలుసు. ఆన్‌లైన్ రైల్ టికెట్ బుకింగ్, ఫుడ్ కేటరింగ్, టూరిజం లాంటి సేవల్ని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. రైలు టికెట్ బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీదే గుత్తాధిపత్యం. యూనిక్ బిజినెస్ మోడల్ ఉండటంతో ఐఆర్‌సీటీసీ మంచి లాభాలు ఇస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఐఆర్‌సీటీసీ షేర్‌కు ఇంత డిమాండ్.

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Loading...
IRCTC: మీ రైలు టికెట్ మరొకరి పేరు మీదకు మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...