IRCTC: ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర... హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ

IRCTC Ramayana Yatra | ప్యాకేజీలో హోటల్ అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఖర్చులు, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

news18-telugu
Updated: November 17, 2019, 6:24 PM IST
IRCTC: ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర... హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ
IRCTC: ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర... హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రామాయణానికి సంబంధం ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర ప్యాకేజీ ప్రకటించింది. శ్రీలంకలోని రామాయణ సంబంధిత ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్‌సీటీసీ. 2019 డిసెంబర్ 18న మొదటి టూర్, 2020 జనవరి 10న రెండో టూర్ ప్రారంభమవుతుంది. 4 రాత్రులు, 5 రోజుల టూర్ ఇది. ఐఆర్‌సీటీసీ రామాయణ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.41980. ప్యాకేజీలో హోటల్ అకామడేషన్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఖర్చులు, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. హైదరాబాద్ నుంచి కొలంబో, డంబుల్లా, కాండీ, నెగోంబా మీదుగా టూర్ కొనసాగుతుంది.


IRCTC Ramayana Yatra: ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర ప్యాకేజీ వివరాలివే...




ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఉదయం 10:15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. అక్కడ్నుంచి డంబుల్లా చేరుకోవాలి. దారిలో మునీశ్వరం ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత మనవేరి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి డంబుల్లాలో బస చేయాలి. రెండో రోజు డంబుల్లా నుంచి కాండీకి బయల్దేరాలి. తిరుకోనేశ్వర్, లక్ష్మీ నారాయణ ఆలయం, కన్నియై హాట్ స్ప్రింగ్స్ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కాండీ సిటీ టూర్ ఉంటుంది. ఆ తర్వాత జెమ్స్ ఫ్యాక్టరీ, గౌతమ బుద్ధ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి కాండీలో బస చేయాలి. మూడో రోజు నువారయెలియా టూర్ ఉంటుంది. దారిలో రాంబోడలో శ్రీభక్త హనుమాన్ ఆలయం, సీతా అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక సందర్శన ఉంటుంది. నాలుగో రోజు కొలంబో సిటీ టూర్, షాపింగ్ ఉంటుంది. నెగోంబాలో రాత్రి బస చేయాలి. ఐదో రోజు ఉదయం 07:25 గంటలకు కొలంబోలో ఫ్లైట్ ఎక్కితో 09:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Loading...
మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



ఇవి కూడా చదవండి:

IRCTC: రైల్వే ప్రయాణికులకు 49 పైసలకే రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ ఇస్తున్న ఐఆర్‌సీటీసీ

SBI Alert: ఈ తప్పుతో మీ డబ్బులు పోతే బ్యాంకుకు సంబంధం లేదంటున్న ఎస్‌బీఐ

Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?
First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com