IRCTC IPO: గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీలో మీరూ పెట్టుబడులు పెట్టొచ్చు ఇలా

IRCTC IPO | ఎవరైనా ఐఆర్‌సీటీసీ ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే కనీసం 40 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్‌కు కనీసం రూ.12,200 నుంచి రూ.12,400 మధ్య ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: September 30, 2019, 9:05 PM IST
IRCTC IPO: గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీలో మీరూ పెట్టుబడులు పెట్టొచ్చు ఇలా
IRCTC IPO: గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీలో మీరూ పెట్టుబడులు పెట్టొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్-IPO ప్రారంభమైంది. ఐఆర్‌సీటీసీ షేర్లల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.315-320. కేంద్ర ప్రభుత్వ వాటా 12.6 శాతం తగ్గించి మొత్తం 2 కోట్ల షేర్లను అమ్మేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధమైంది. వీటి ద్వారా సుమారు రూ.645 కోట్లు సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఎవరైనా ఐఆర్‌సీటీసీ ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే కనీసం 40 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్‌కు కనీసం రూ.12,200 నుంచి రూ.12,400 మధ్య ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కొనాలనుకునేవాళ్లు 40, 80, 120.. ఇలా 40 షేర్ల చొప్పున కొనొచ్చు.  ఐఆర్‌సీటీసీ ఉద్యోగులకు ఫైనల్ ఆఫర్ ప్రైస్ పైన ప్రతీ షేర్‌పై రూ.10 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే వారికి ప్రైస్ బ్యాండ్ రూ.305-310 మధ్య ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 3న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ అక్టోబర్ 9న జరిగే అవకాశముంది. ఐఆర్‌సీటీసీ షేర్ బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈలో అక్టోబర్ 14న లిస్ట్ కానుంది.

చాలామంది ఇన్వెస్టక్లు కొంతకాలంగా ఐఆర్‌సీటీసీ ఐపీఓ గురించి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తరచూ రైలు ప్రయాణం చేసేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్-IRCTC గురించి బాగా తెలుసు. ఆన్‌లైన్ రైల్ టికెట్ బుకింగ్, ఫుడ్ కేటరింగ్, టూరిజం లాంటి సేవల్ని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. రైలు టికెట్ బుకింగ్‌లో ఐఆర్‌సీటీసీదే గుత్తాధిపత్యం. యూనిక్ బిజినెస్ మోడల్ ఉండటంతో ఐఆర్‌సీటీసీ మంచి లాభాలు ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఐఆర్‌సీటీసీ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేయడానికి ఎంతమంది పోటీపడతారో చూడాలి.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Dussehra Sale: మీకు సెల్ఫీలు ఇష్టమా? దసరా సేల్‌లో ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్

Smartphone offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్లు ఇవే...Redmi offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు ఇవే...
Published by: Santhosh Kumar S
First published: September 30, 2019, 11:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading