హోమ్ /వార్తలు /బిజినెస్ /

Banks: ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త నిర్ణయం అమలులోకి!

Banks: ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త నిర్ణయం అమలులోకి!

ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త నిర్ణయం అమలులోకి!

ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త నిర్ణయం అమలులోకి!

Bank of Baroda | బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బ్యాంకులు వరుసపెట్టి ఎంసీఎల్ఆర్ రేటును పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు మరో రెండు బ్యాంకులు ఈ లిస్ట్‌లో చేరాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Indian Overseas Bank | మీరు లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? లేదంటే ఇప్పటికే రుణం తీసుకున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. తాజాగా రెండు బ్యాంకులు (Banks) కస్టమర్లకు ఝలక్ ఇచ్చాయి. రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ బ్యాంకుల్లో లోన్ (Loan) తీసుకున్న వారిపై, అలాగే తీసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎందుకంటే రుణ రేట్లు పెరగడం వల్ల నెలవారీ ఈఎంఐ (EMI) కూడా పైపైకి చేరనుంది. అందువల్ల కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

  ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచేశాయి. ఈ బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును 0.10 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీని వల్ల బ్యాంక్ కస్టమర్లపై ఎఫెక్ట్ పడుతుంది. రుణాలు మరింత ప్రియం అవుతాయి. ఎంసీఎల్ఆర్ రేటుతో అనుసంధానమైన రుణాలు అన్నీ భారం అవుతాయని గుర్తించుకోవాలి.

  ఎస్‌బీఐతో కళ్లుచెదిరే లాభం.. రూ.5 వేల పొదుపుతో రూ.29 లక్షలు

  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు సంబంధించి రేట్ల పెంపు తర్వాత ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి చేరింది. దీని వల్ల కార్ లోన్ , పర్సనల్ లోన్ , హోమ్ లోన్స్ వంటి వాటిపై ప్రభావం పడనుంది. రెండేళ్లు, మూడేళ్లు ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతానికి చేరింది. అలాగే నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.15 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.05 శాతానికి ఎగసింది. మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు అయితే 7.7 శాతానికి చేరింది. ఎంసీఎల్ఆర్ రేట్లు సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వస్తాయని (అంటే నేటి నుంచే) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది.

  రూ.లక్షకు రూ.కోటి.. అదృష్టం అంటే వారిదే!

  ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.8 శాతానికి చేరింది. ఇదివరకు ఈ రేటు 7.7 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 7.55 శాతం నుంచి 7.65 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 7.5 శాతానికి ఎగసింది. ఇది వరకు ఈ రేటు 7.45 శాతంగా ఉండేది. బ్యాంక్ ఆఫ్ బరోడా రేట్ల పెంపు నిర్ణయం సెప్టెంబర్ 12 నుంచి అమలులోకి వస్తాయి. అందువల్ల ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుల్లో లోన్ పొందడం ఉత్తమం.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Bank loan, House loan, Mclr, Personal Loan

  ఉత్తమ కథలు