Indian Oil Money Offer: ఇందులో పాల్గొనండి... రూ.2 కోట్లు గెలుచుకోండి... వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

Indian Oil Money Offer: వేలు కాదు లక్షలు కాదు... ఏకంగా 2 కోట్లు గెలుచుకునే ఛాన్స్. దక్కితే లైఫ్ సెట్టైపోతుంది. పోయేదేముంది ప్రయత్నించి చూస్తే సరి. ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో పూర్తి వివరాలు ఇవే.

  • Share this:
    Prize Money Offer: కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నకు పర్ఫెక్టు ఆన్సర్ ఇక్కడ లభిస్తోంది. ఇండియన్ ఆయిల్... మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు రూ.2 కోట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఈ సమాచారాన్ని ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెట్... తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ @IndianOilcl లో తెలిపింది. ఇండియన్ ఆయిల్... ఓ స్కీమ్ నిర్వహిస్తోంది. దాని ప్రకారం మీరు మీ వాహనానికి 25 లీటర్ల డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఒకే బిల్లుగా మొత్తం డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత SMS పంపి రూ.2 కోట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రైజెస్ ప్రతి వారం, రెండువారాలకు ఓసారి, అలాగే నెలకు ఒకసారి ఇస్తున్నారు. ఇలా జులై 31 వరకూ ఇస్తామని ట్వీ్ట్ ద్వారా తెలిపింది. ఈ స్కీమ్ పేరు డీజిల్ భరో ఇనామ్ జీతో (డీజిల్ వేయించుకోండి... ప్రైజ్ గెలవండి)

    ఈ ప్రైజ్ పొందాలంటే... SMS పంపాలి అందుకోసం... డిలర్ కోడ్ ఇచ్చి స్పేస్ ఇవ్వాలి ఆ తర్వాత బిల్ నంబర్ వెయ్యాలి మళ్లీ స్పేస్ ఇచ్చి... ఎంత డీజిల్ పోయించుకున్నదీ (DEALER CODE <SPACE> BILL NUMBER <SPACE> QUANTITY) ఇచ్చి... 77990 33333కి మెసేజ్ పంపాలి.

    ఏప్రిల్ 4, 2021న ఈ ఆఫర్ మొదలైంది. జులై 31, 2021న ముగుస్తుంది. జులై 31 అర్థరాత్రి 12 తర్వాత వచ్చే ఎంట్రీ మెసేజ్‌లను లెక్కలోకి తీసుకోరు.

    ఇండియన్ ఆయిల్ ట్వీట్ ఇక్కడ చూడండి.


    అర్హులు ఎవరు?
    - ఈ ఆఫర్‌కి భారతీయులు అర్హులు.
    - వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి. ఇండియాలో నివసిస్తూ ఉండాలి.
    - రోజుకు ఒక మొబైల్ నుంచి 2 SMSలు పంపవచ్చు. అందుకోసం రెండు బంకుల్లో చెరో 25 లీటర్లు పోయించుకోవచ్చు. లేదా ఒక బంకు నుంచి పోయించుకొని... 2 బిల్లులు పొందవచ్చు.
    - డీజిల్ పోయించుకునే బంకులు... ఇండియన్ ఆయిల్ బంకులు అయి ఉండాలి.

    ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యవంతం


    SMS Charges:
    ఈ ప్రైజ్ మనీ కోసం పంపే SMSలకు ఛార్జీ ఉంటుంది. ఆయా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎంత ఛార్జీ వసూలు చేస్తారో అంత ఛార్జీ పడుతుంది. సాధారణంగా ఇది రూ.3 దాకా ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published: