HOME »NEWS »BUSINESS »indian oil corporation selling chhotu gas cylinder with 5 kg capacity know how to buy ss

LPG Gas Cylinder: అర్జెంటుగా గ్యాస్ సిలిండర్ కావాలా? వెంటనే తెచ్చుకోండి ఇలా

LPG Gas Cylinder: అర్జెంటుగా గ్యాస్ సిలిండర్ కావాలా? వెంటనే తెచ్చుకోండి ఇలా
LPG Gas Cylinder: అర్జెంటుగా గ్యాస్ సిలిండర్ కావాలా? వెంటనే తెచ్చుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

LPG Gas Cylinder | గ్యాస్ సిలిండర్ ఉపయోగించేవారికి గుడ్ న్యూస్. ఇంట్లో గ్యాస్ అయిపోయిన వెంటనే సిలిండర్ తెచ్చుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    వంట సగంలో ఉన్నప్పుడు సడెన్‌గా సిలిండర్‌లో గ్యాస్ అయిపోతే అప్పుడు టెన్షన్ అంతా ఇంతా కాదు. అప్పటికప్పుడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే పరిస్థితి ఉండదు. సిలిండర్ బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. సిలిండర్ వచ్చే వరకు టెన్షనే. అయితే ఈ టెన్షన్ అంతా ఒకప్పుడు. ఇకపై మీరు అర్జెంటుగా గ్యాస్ సిలిండర్ కావాలంటే ఈజీగా తెచ్చుకోవచ్చు. కస్టమర్లు కోరుకున్న వెంటనే సిలిండర్లు ఇచ్చేందుకు చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్ ప్రవేశపెట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. 5కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ-FTL అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్‌కు 'Chhotu' అని పేరు పెట్టింది. వెంటనే గ్యాస్ సిలిండర్ కావాలనుకునేవారికి ఈ చిన్న సైజ్ సిలిండర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వెంటనే తెచ్చుకోవచ్చు. ఈ సిలిండర్‌ను ఎవరైనా తీసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. ఎక్కడైనా రీఫిల్ కూడా చేసుకోవచ్చు.

    Gold: మార్కెట్ రేట్ కన్నా తక్కువకే బంగారం... రేపటి నుంచి సేల్



    Gold Price: బంగారం ధర ఢమాల్... రూ.7,500 తగ్గిన గోల్డ్ రేట్

    మార్కెట్లో చిన్నసైజ్ సిలిండర్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంట్లో ఒకరిద్దరు ఉండేవాళ్లు, బ్యాచిలర్స్‌ ఈ చిన్న సిలిండర్లు కొంటూ ఉంటారు. బ్యాచిలర్స్‌కు పెద్ద సైజ్ సిలిండర్‌తో పెద్దగా అవసరం ఉండదు. చిన్న సిలిండర్ సౌకర్యంగా ఉంటుంది. వలస కూలీలు కూడా పెద్ద సిలిండర్ మెయింటైన్ చేయలేరు. ఈ చిన్న సైజ్ సిలిండర్ ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్లడం సులువు. ఇంట్లో గ్యాస్ తక్కువగా వాడేవారికి కూడా 'ఛోటు' సిలిండర్ ఉపయోగకరంగా ఉంటుంది. వీరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఆయిల్ 'ఛోటు' సిలిండర్ తీసుకొచ్చింది. ఈ సిలిండర్ కావాలంటే కస్టమర్లు కేవలం ఐడీ ప్రూఫ్ చూపిస్తే చాలు. వెంటనే సిలిండర్ తీసుకోవచ్చు. పేపర్ వర్క్ కూడా ఎక్కువగా ఉండదు.

    HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయొచ్చు ఇలా

    EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు


    దేశంలోని 695 జిల్లాల్లో 'ఛోటు' సిలిండర్ కొనొచ్చు. ఇప్పటివరకు 52 లక్షల 'ఛోటు' సిలిండర్లను అమ్మింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. కస్టమర్లు తమకు దగ్గర్లో ఉన్న ఇండియన్ ఆయిల్ రీటైల్ ఔట్‌లెట్స్, ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్, కిరాణా షాపుల్లో 'ఛోటు' సిలిండర్ తీసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:December 27, 2020, 12:22 IST

    टॉप स्टोरीज