గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే... సిలిండర్ ఇంటికి రావడానికి ఒకట్రెండు రోజులు వేచిచూడక తప్పదు. ఒక్కోసారి సిలిండర్ డెలివరీ కావడానికి వారం రోజులు కూడా పడుతుంది. కానీ... ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు... ఫుడ్ డెలివరీ లాగా 2 గంటల్లో సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రారంభించిన కొత్త సర్వీస్ ఇది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఈ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రెండు గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 'ఇండేన్ తత్కాల్ సేవ' పేరుతో కొత్త సర్వీస్ ప్రారంభించింది. తొలిసారిగా ఈ సర్వీస్ అందిస్తోంది ఇండియన్ ఆయిల్. కేవలం రెండు గంటల్లో ఇంటికి సిలిండర్ తీసుకొచ్చి ఇస్తోంది.
'ఇండేన్ తత్కాల్ సేవ' ద్వారా వినియోగదారులు సిలిండర్ బుక్ చేస్తే రెండు గంటల్లో ఇంటికి సిలిండర్ వస్తుంది. కస్టమర్లు ఐవీఆర్ఎస్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ లేదా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా బుక్ బుక్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ పద్ధతిలో బుకింగ్ కాబట్టి సిలిండర్ ధర కన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. తర్వాత మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కస్టమర్లకు 'ఇండేన్ తత్కాల్ సేవ' అందించనున్నారు.
Samsung Galaxy M52: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.8,000 డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్
In an industry first, IndianOil's Indane Tatkal Seva assures delivery of LPG refill within 2 hours of booking. Customers can avail the service through IVRS, IndianOil website or IndianOil One App at a very nominal premium. Now available at selected distributorships in Hyderabad. pic.twitter.com/rWa85UMDmw
— Indian Oil Corp Ltd (@IndianOilcl) January 14, 2022
ఈ సర్వీస్ అందరికీ అందుబాటులోకి వస్తే ఇక సిలిండర్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కాస్త ఎక్కువ చెల్లిస్తే చాలు... ఫుడ్ డెలివరీ లాగానే గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పేటీఎం లాంటి యాప్స్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. కానీ... 'ఇండేన్ తత్కాల్ సేవ' ద్వారా సిలిండర్ బుక్ చేయాలంటే ఇండియన్ ఆయిల్ ప్లాట్‌ఫామ్ మాత్రమే ఉపయోగించాలి. ఇండియన్ ఆయిల్ ఐవీఆర్ఎస్ నెంబర్, వెబ్‌సైట్, యాప్ ద్వారానే బుక్ చేయాలి.
Vivo V23 5G: వివో వీ23 సేల్ మొదలైంది... రూ.2,500 డిస్కౌంట్, మరిన్ని ఆఫర్స్
వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిన సందర్భాల్లో వెంటనే సిలిండర్ కావాలనుకుంటే 'ఇండేన్ తత్కాల్ సేవ' ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే ప్రస్తుతం కొందరు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఈ సర్వీస్ అందిస్తున్నారు. త్వరలో 30 కోట్ల మంది ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. 'ఇండేన్ తత్కాల్ సేవ' ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఉండే గ్యాస్ సిలిండర్ ధర కన్నా రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అర్జెంటుగా సిలిండర్ అవసరం లేనివాళ్లు సాధారణ బుకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.