డబ్బులు చెల్లించలేదని జెట్ ఎయిర్‌వేస్ విమానాలకు ఇంధనం బంద్..

ఈ రోజు మధ్యహ్నం 12 గంటల నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానాలకు రీఫ్యూయెలింగ్ సేవలను ఆపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి.

news18-telugu
Updated: April 5, 2019, 5:31 PM IST
డబ్బులు చెల్లించలేదని జెట్ ఎయిర్‌వేస్ విమానాలకు ఇంధనం బంద్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 5, 2019, 5:31 PM IST
అప్పుల్లో కూరుకుపోయి చేతులెత్తేసిన జెట్ ఎయిర్ వేస్‌కు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే మేనేజ్ మెంట్ అజమాయిషీ మొత్తం బ్యాంకుల కన్సార్షియం చేతుల్లోకి వెళ్లిపోయిన జెట్ ఎయిర్ వేస్‌కు వరుసపెట్టి చిక్కులు తప్పడం లేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కూడా జెట్ ఎయిర్ వేస్ ఇంధన బకాయీలు చెల్లించాల్సిందేనని పట్టు పట్టింది. అంతేకాదు ఈ రోజు మధ్యహ్నం 12 గంటల నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానాలకు రీఫ్యూయెలింగ్ సేవలను ఆపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికే కేవలం 26 విమానాలతో నామమాత్రపు సర్వీసులు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఈ దెబ్బతో పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇదిలాఉంటే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ సంస్థను బ్యాంకుల కన్సార్షియం ఆదుకునేందుకు ముందుకు రావడంతో సంస్థ నరేష్ గోయల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అంతేకాదు సంస్థకు అత్యవసర నిధి కింది బ్యాంకులు, రుణదాతలు 1500 కోట్ల నిధులు సేకరించనున్నట్లు తెలిపాయి. అంతే కాదు అత్యవసర నిధికి ప్రతిగా జెట్ ఎయిర్ వేస్‌కు చెందిన 50.1 శాతం ఈక్విటీ షేర్లను బ్యాంకులు పొందనున్నాయి. కాగా నేటి వరకూ జెట్ ఎయిర్ వేస్ పునరుద్ధరణకు అత్యవసర నిధి నుంచి నిధులు ఇంకా రావాల్సి ఉంది. అలాగే సిబ్బంది జీతాలు, ఇతర బకాయీలు జెట్ ఎయిర్ వేస్ ముంగిట కొండలా పేరుకుపోయాయి.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...