పెట్రోల్ ధరలు భారీగా పెరిగి కొన్ని రోజుల క్రితం రేట్ తగ్గినా ఇప్పటికీ పెట్రోల్ కొనడం సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు భారమే. అయితే పెట్రోల్ ఉచితంగా లభిస్తే ఎవరైనా ఎందుకు వద్దంటారు. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఇలాంటి ఆఫర్ ఇస్తోంది. ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ (Credit Card) రూపొందించింది యాక్సిస్ బ్యాంక్. ఈ క్రెడిట్ కార్డుతో అనే ఆఫర్స్ పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. రెండో ఏడాది నుంచి రూ.500 యాన్యువల్ ఫీజు చెల్లించాలి. ఏటా రూ.50,000 కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మాఫీ చేస్తారు.
ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసి ఈఎంఐగా మార్చుకుంటే ఏటా 49.36 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈఎంఐగా మార్చుకోకపోవడమే మంచిది. ఈ క్రెడిట్ కార్డుతో ఏటా 53 లీటర్ల వరకు ఫ్యూయెల్ ఉచితంగా పొందొచ్చని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది. 53 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఎలా లభిస్తుందో కూడా వెబ్‌సైట్‌లో వివరించింది. ఆ చార్ట్ ఇక్కడ చూడొచ్చు.
Post Office Scheme: రిస్కు లేకుండా తక్కువ టైమ్‌లో రూ.2.78 లక్షల రిటర్న్స్... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే
ఈ చార్టులో వివరించినట్టుగా 53 లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పొందొచ్చని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది. అయితే పెట్రోల్ ధర లీటర్ రూ.70 చొప్పున యాక్సిస్ బ్యాంక్ లెక్కించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉంది. ఈ లెక్కన చూస్తే 33 లీటర్ల పెట్రోల్ ఉచితంగా పొందొచ్చు.
ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటే మీకు దగ్గర్లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో సంప్రదించాలి. లేదా యాక్సిస్ బ్యాంకు వెబ్‌సైట్‌లో అప్లై చేయొచ్చు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారెవరైనా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. 15 ఏళ్లు దాటిన వారికి యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి పాన్ కార్డ్, ఫామ్ 60, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరి.
ATM Charges: ఏటీఎంలో ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.173 సర్వీస్ ఛార్జీ... క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఇదొక్కటే కాదు... యాక్సిస్ బ్యాంక్ నుంచి కస్టమర్ల అవసరాలను బట్టి వేర్వేరు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్, స్పైస్‌జెట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, విస్తారా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఫ్లైట్ టికెట్లపై ఆఫర్స్ పొందొచ్చు.
యాక్సిస్ బ్యాంక్ మాత్రమే కాదు సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి బ్యాంకులు కూడా ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుల్ని ఇస్తుంటాయి. ఈ క్రెడిట్ కార్డులు తీసుకునేముందు నియమనిబంధనల్ని పూర్తిగా చదువుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Credit cards, Indian Oil Corporation, Personal Finance, Petrol prices