INDIAN MARKETS WITNESSED A SELLOFF IN TRADE ON SEPTEMBER 3 WEIGHED DOWN BY BOTH LOCAL AND GLOBAL CUES MK
Stock Market: రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి...769 పాయింట్ల పతనమైన సెనెక్స్...
(ప్రతీకాత్మక చిత్రం)
దేశీయ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్‌లో కేవలం ఒక్క మంగళవారం ట్రేడింగ్ సెషన్లో సుమారు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. గడచిన 11 నెలల్లో ఇదే దారుణమైన పతనమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు జీడీపీ పతనం దెబ్బతో కుదేలయ్యాయి. దేశీయ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్‌లో కేవలం ఒక్క మంగళవారం ట్రేడింగ్ సెషన్లో సుమారు రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. గడచిన 11 నెలల్లో ఇదే దారుణమైన పతనమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మార్కెట్ ముగిసే నాటికి సెన్సెక్స్ -769.88 పాయింట్లు నష్టపోయి 36562.91 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ -225.40 పాయింట్లు నష్టపోయి 10797.90 వద్ద ముగిసింది. ఇక మరో కీలక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 603 పాయింట్లు పతనమై 26824 వద్ద ముగిసింది. 2018 సంవత్సరం అక్టోబర్‌లో సెన్సెక్స్ 770 పాయింట్లు నష్టపోయింది. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో సెన్సెక్స్ నష్టాలు మూటగట్టుకుంది. మార్కెట్లను భారీగా పతనానికి గురిచేసిన సెక్టార్ల పరంగా చూసినట్లయితే నిఫ్టీ మెటల్స్ సూచీ 3 శాతం పతనమైంది.
ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని మార్కెట్లు నెగిటివ్ గా తీసుకోవడంతో నిఫ్టీ ప్రభుత్వ బ్యాంకుల సూచీ ఏకంగా 4.87 శాతం పతనమైంది. ప్రభుత్వ బ్యాంకుల్లో కెనెరా బ్యాంక్ 10 శాతం పతనం కాగా, ఇండియన్ బ్యాంక్ 11.68 శాతం పతనమైంది. ఇక పీఎన్బీ 8.47 శాతం పతనమైంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.