Indian Gold Coin Scheme: మోదీ ప్రభుత్వం అందిస్తున్న గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయండిలా...

ప్రతీకాత్మకచిత్రం

ఎమ్​ఎమ్​టిసి, జ్యువెలర్స్, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నేరుగా ఈ పథకంలో కొనుగోలుకు అందుబాటులోకి తెస్తుంది. కాగా, విదేశీ బంగారు నాణేల దిగుమతిని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

  • Share this:
భారత ప్రధాని నరేంద్రమోదీ 2015లో ప్రారంభించిన ఇండియన్ గోల్డ్ కాయిన్ స్కీమ్​లో తాజాగా కొన్ని కీలక సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేసేందుకు అనేక నిబంధనలను చేర్చింది. ప్రస్తుతం మెటల్స్ అండ్​ మినరల్స్​ ట్రేడింగ్​ కార్పొరేషన్​ (MMTC) పరిధిలో అమలవుతున్న ఈ పథకంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్చిన నిబంధనలతో ఈ పథకం ప్రజాదరణ పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు సులభంగా ఆన్​లైన్​ ఈ-కామర్స్ ప్లాట్​ఫామ్​లతో సహా పలు మార్కెటింగ్​ మార్గాల ద్వారా ఇందులో చేరే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎమ్​ఎమ్​టిసి, జ్యువెలర్స్, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నేరుగా ఈ పథకంలో కొనుగోలుకు అందుబాటులోకి తెస్తుంది. కాగా, విదేశీ బంగారు నాణేల దిగుమతిని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

భారతీయ బంగారు నాణెం పథకంలో కొత్త సవరణలు
1. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) ప్రస్తుతం 1 గ్రాము, 2 గ్రాముల చిన్న విలువ కలిగిన భారతీయ బంగారు నాణేలను కూడా ముద్రించడానికి అనుమతి ఇచ్చింది. కాగా, అంతకుముందు 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను మాత్రమే ముద్రించేవారు.
2. ఈ బంగారు నాణేలు అధునాతన భద్రతా లక్షణాలతో లోడ్ చేయబడి ఉంటాయి. అలాగే, ఇవి దేశంలోనే తయారైన స్వచ్చమైన BIS హాల్‌మార్క్ బంగారు నాణేలని కేంద్రం స్పష్టం చేసింది.

ఇతర సవరణలు
1. ఇప్పుడు ఎస్పీఎంసీఐఎల్, ఆన్​లైన్​ ఈ–-కామర్స్ ప్లాట్‌ఫాంలు, విమానాశ్రయాలతో సహా ఇతర ఛానెళ్ల ద్వారా ఈ భారతీయ బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు.
2. ప్రత్యక్ష అమ్మకాలకు ఎమ్​ఎమ్​టీసీ జ్యువెలర్స్​, బ్యాంకులు, ఇండియా పోస్ట్​ మొదలైన పలు మార్కెటింగ్​ మార్గాల ద్వారా అందుబాటులో ఉంటుంది.
3. బోర్డు ఆమోదించిన విధానం ఆధారంగా ఎస్పీఎంసీఐఎల్​ తన ఈ–కామర్స్​ పోర్టల్​ ద్వారా ఐజీసీలపై ఎగుమతి ఆర్డర్లను అందిస్తుంది.
4. ప్రస్తుతం, ఈ కాయిన్స్​ 24 క్యారెట్లలో 995 ఫైన్​నెస్​లో మాత్రమే లభిస్తున్నాయి. ఇకపై, ఇవి 999 ఫైన్​నెస్ తో​ 24 క్యారెట్లలో కూడా తయారు చేయబడతాయి. కాబట్టి, కొత్త నిబంధనలు అమలులో ఉన్నందున, 999, 995 ప్యూరిటీతో కూడిన 24 క్యారెట్ల ఐజీసీలు అందుబాటులో ఉంటాయి.
5. ఈ గోల్డ్​ కాయిన్స్​ను కొనుగోలు చేయడానికి దేవాలయాలు, ట్రస్టులు మొదలైన వాటికి ఎస్.పి.ఎం.సి.ఎల్ ముంబై అనుమతిచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కొత్త వేరియంట్లను కూడా లాంఛ్​ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Published by:Krishna Adithya
First published: