Home /News /business /

INDIAN ELECTRIC VEHICLE MAKER ATHER ENERGY HAS OPENED A SECOND MANUFACTURING FACILITY IN HOSUR TAMIL NADU PRV GH

Ather Energy: తమిళనాడులో అథర్​ ఎనర్జీ రెండో తయారీ యూనిట్.. ఏటా 4 లక్షల ఈవీ స్కూటర్ల తయారీ లక్ష్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ ఎలక్ట్రిక్​ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ తన మార్కెట్​ను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే అథర్​ 450 ఎక్స్​, 450 ప్లస్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తమిళనాడులోని హోసూర్‌లో రెండవ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.

ఇంకా చదవండి ...
భారతీయ ఎలక్ట్రిక్​ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ (Ather Energy) తన మార్కెట్​ను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే అథర్​ 450 ఎక్స్​, 450 ప్లస్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తమిళనాడు (Tamilnadu)లోని హోసూర్‌లో రెండవ తయారీ కేంద్రాన్ని (second manufacturing facility) ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం 120,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండగా.. రాబోయే కాలంలో ఏటా 400,000 యూనిట్లను తయారు చేయాలని భావిస్తోంది.

మార్కెట్​లో డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి కంపెనీ రాబోయే ఐదేళ్లలో రూ. 650 కోట్ల పెట్టుబడి (Investment) పెట్టాలని యోచిస్తోంది. అక్టోబర్‌లో అథర్ ఎనర్జీ  (Ather Energy) గత ఏడాది కంటే 12 రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. $100 మిలియన్ల రిటైల్ ఆదాయాన్ని సాధించింది. ఈ విభాగంలో మార్కెట్​ వాల్యూని బట్టి చూస్తే భారత్​లో అతిపెద్ద ఎలక్ట్రిక్​ వాహన తయారీదారుగా నిలిచింది.

450 సిరీస్​లో 450 ఎక్స్​, 450 ప్లస్‌లకు డిమాండ్..

బిజినెస్​ విస్తరణపై అథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు & సీఈవో తరుణ్ మెహతా (Tharun Mehta) మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పెరుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరల (Petrol and diesel price) కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్​ వాహనాల వైపు చూస్తున్నారు. మా అథర్​ 450 సిరీస్​లో 450 ఎక్స్​, 450 ప్లస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటిలోని ఫీచర్లే  (features)ఇంతటి డిమాండ్​కు కారణం. మా ఈ–స్కూటర్లకు (E scooters) పెరుగుతున్న డిమాండ్​ దృష్ట్యా దేశవ్యాప్తంగా డీలర్​షిప్​ కేంద్రాలను విస్తరిస్తున్నాం. రాబోయే త్రైమాసికాల్లో మా రిటైల్ ఫుట్‌ప్రింట్ ఆరు రెట్లకు పెంచనున్నాం. మరోవైపు, కస్టమర్ల డిమాండ్​ తీర్చేందుకు వచ్చే ఏడాది రెండో తయారీ యూనిట్ (second manufacturing facility) ​ను కూడా ప్రారంభించనున్నాం. తద్వారా దేశంలోనే అతిపెద్ద ఈవీ ఉత్పత్తిదారుగా అవతరించే దిశగా పని చేస్తున్నాం." అని అన్నారు.

నెలవారీ విక్రయాల్లో 20 శాతం వృద్ది..

టూ-వీలర్ ఈవీ స్పేస్‌లో అథర్ ఎనర్జీ (Ather energy) పాపులర్​ బ్రాండ్​గా కొనసాగుతోంది. ఇది 2020 నవంబర్ నుండి నెలవారీ విక్రయాల్లో 20% వృద్ధి నమోదు చేస్తోంది.​ ఏప్రిల్ నుండి -అక్టోబర్ మధ్య కాలంలో అథర్​ డీలర్​షిప్​ సెంటర్లకు (Ather Dealership Center) వాక్-ఇన్‌లు, వెబ్​సైట్​లో ఎంక్వైరీలు, టెస్ట్ రైడ్‌లు మూడు రెట్లు పెరిగాయి. ఈ కాలంలో వాహన బుకింగ్‌లు నాలుగు రెట్లు వృద్ది చెందాయి.

కంపెనీ ఈవీ తయారీతో పాటు లిథియం- అయాన్ బ్యాటరీ తయారీ (Lithium battery manufacturing)పై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే బ్యాటరీ తయారీ పేటెంట్​ హక్కు (Patent right)లను కూడా పొందింది. కొత్త మార్కెట్‌లకు విస్తరించడం ద్వారా రిటైల్ కార్యకలాపాలను బలోపేతం చేయాలని అథర్ ఎనర్జీ భావిస్తోంది. 2023 మార్చి నాటికి మొత్తం 100 నగరాల్లో దాదాపు 150 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Electric vehicle, SCOOTER, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు