Indian Economy: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది...ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ సంచలన నివేదిక...

అక్టోబర్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం కరోనా కాలంలో మొదటి స్థాయిలో ఉంది. ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాలకు ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అక్టోబర్లో, కూరగాయలు, పండ్లు, గుడ్ల ధర దాదాపు ఆరున్నర సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి

news18-telugu
Updated: November 15, 2020, 7:50 PM IST
Indian Economy: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది...ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ సంచలన నివేదిక...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన రికవరీని కనబరుస్తోందని, అలాగే త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి నిర్ణయం తీసుకోనుందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్అంచనా వెలువరించింది. నిజానికి కరోనా దెబ్బతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు అయ్యాయి. అటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి కూరుకుపోయింది. కానీ అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం సగటున 6 శాతానికి మించి ఉండనుందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ తెలిపింది. డిసెంబరులో జరగనున్న ద్రవ్య విధాన సమావేశంలో, వడ్డీ రేట్లను యధాతథ స్థితి కొనసాగించే వీలుందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది.

ద్రవ్యోల్బణ సమస్య

ఈ నివేదిక ప్రకారం, అక్టోబర్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం కరోనా కాలంలో మొదటి స్థాయిలో ఉంది. ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాలకు ఉత్పత్తుల ధరలు పెరిగాయి. నాల్గవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండవచ్చని హెచ్చరించింది. అక్టోబర్లో, కూరగాయలు, పండ్లు, గుడ్ల ధర దాదాపు ఆరున్నర సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 7.61 శాతంగా ఉంది. ఆర్‌బిఐ లక్ష్యం కన్నా ఇది చాలా ఎక్కువ. 2020 సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.27 శాతంగా ఉంది. ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్  ప్రతినిధులు మాట్లాడుతూ..కరోనా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే బాగా కోలుకుంటుందని అనేక ఆర్థిక కార్యకలాపాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. పాలసీ వడ్డీ రేట్లను సడలించే ప్రక్రియపై ఆర్‌బిఐ ఇప్పుడు బ్రేక్ వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మూడీస్ అంచనాలో కూడా మెరుగుదల

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత జిడిపి అంచనాను సవరించింది. 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారత జిడిపి (మైనస్) 8.9 తగ్గుతుందని మూడీస్ అంచనా వేసింది. సుదీర్ఘమైన మరియు కఠినమైన లాక్డౌన్ తరువాత, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది.

తీవ్ర మాంద్యంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ

ఇదిలా ఉంటే దేశ చ‌రిత్ర‌లో తొలిసారి.. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ మాంద్యంలోకి ప్ర‌వేశించిన‌ట్లు ఆర్బీఐ అంచ‌నా వేసింది. భార‌త జీడీపీ వ‌రుస‌గా రెండ‌వ క్వార్ట‌ర్‌లోనూ పేల‌వ ప్ర‌ద‌ర్శన చూపిన‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది.  జీడీపీ 8.6(మైన‌స్‌) శాతానికి ప‌డిపోవ‌డం వ‌ల్ల దేశం ఆర్థిక మాంద్యం దిశ‌గా వెళ్తోంద‌ని ఆర్బీఐ అభిప్రాయ‌ప‌డింది.  ఆర్బీఐ ద్ర‌వ్య విధాన ప‌ర‌ప‌తికి చెందిన డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మైఖేల్ పాత్ర త‌న నివేదిక‌లో వెల్ల‌డించారు.
Published by: Krishna Adithya
First published: November 15, 2020, 7:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading