హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Bank: ఇండియన్ బ్యాంక్ నుంచి స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ లాంచ్.. తక్కువ గడువుతో ఎక్కువ వడ్డీ ఆఫర్..

Indian Bank: ఇండియన్ బ్యాంక్ నుంచి స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ లాంచ్.. తక్కువ గడువుతో ఎక్కువ వడ్డీ ఆఫర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్లాన్‌ గడువు 610 రోజులుగా ఉంది. ఈ ప్రత్యేక స్కీమ్‌ కింద సాధారణ ప్రజలకు సంవత్సరానికి 6.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 6.25 శాతం; 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 6.5 శాతం వడ్డీ రేటు అందుతుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై తక్కువ మెచూరిటీతో ఎక్కువ వడ్డీ అందుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్‌ బ్యాంక్‌. పరిమిత కాలానికి డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల కోసం స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రొడక్ట్‌ను లాంచ్‌ చేసింది. ‘IND UTSAV 610’ పేరుతో ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌ గడువు 610 రోజులుగా ఉంది. ఈ ప్రత్యేక స్కీమ్‌ కింద సాధారణ ప్రజలకు సంవత్సరానికి 6.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 6.25 శాతం; 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 6.5 శాతం వడ్డీ రేటు అందుతుంది.

2022 అక్టోబర్ 31న ఇండియన్ బ్యాంక్ IND UTSAV 610 స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్లాన్ తీసుకునే గడువు ముగుస్తుంది. INDOASIS యాప్‌ ద్వారా ఇండియన్ బ్యాంక్ కస్టమర్లు ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను బుక్ చేసుకోవచ్చు. IND UTSAV 610 ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఆన్‌లైన్‌లో ఈజీగా బుక్ చేసుకునే సదుపాయం ఉంది.

* ఆగస్టు 24న వడ్డీ రేట్ల సవరణ

ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు సార్లు రెపోరేటును పెంచింది. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం తీసుకున్న చర్యలతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను వరుసగా పెంచాయి. ఇండియన్‌ బ్యాంక్‌ తన వడ్డీ రేట్లను చివరిగా ఈ ఏడాది ఆగస్టు 24న సవరించింది. ఆ సమయంలో సవరించిన వడ్డీ రేట్లు రూ.2 కోట్ల లోపు దేశీయ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి.

ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు 2.80 శాతం నుంచి 5.65 శాతం వరకు వడ్డీ రేట్లతో 7 రోజుల నుంచి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది. ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై నాన్-సీనియర్ సిటిజన్‌లకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

అయితే 2022 అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండే IND UTSAV 610 డిపాజిట్ స్కీమ్‌ను బుక్ చేసుకునే వారికి, సీనియర్ సిటిజన్‌లకు పౌరులకు 0.15 శాతం అదనపు ప్రత్యేక వడ్డీ రేటు ప్రయోజనాలను ఇండియన్ బ్యాంక్ అందిస్తోంది. వారు ఈ ప్లాన్‌ కింద 6.10 శాతం వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది. సాధారణ ప్రజలకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.40 శాతం అదనపు వడ్డీ రేటు అందుతుంది.

Festive Offers: ఈ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ ఉన్న వారికి 50 శాతం తగ్గింపు..

Link Aadhaar Card: ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా

* సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్‌

ఫిక్స్‌డ్ డిపాజిట్ తెరవాలని చూస్తున్న సీనియర్ సిటిజన్‌ల ప్రయోజనాలను మెరుగుపరచడానికి, ఇండియన్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో.. సాధారణంగా సీనియర్‌ సిటిజన్ల(60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు)కు అందించే అధిక వడ్డీపై కూడా అదనపు వడ్డీ 0.25 శాతం పొందే ఆఫర్‌ ఉందని తెలిపింది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ 10 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసే టర్మ్ డిపాజిట్ పై ఈ సదుపాయం అందుతుందని పేర్కొంది. IB- గోల్డెన్ ఏజర్ కింద సూపర్ సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేక టర్మ్ డిపాజిట్ ఖాతాపై అన్ని టర్మ్ డిపాజిట్‌లపై 0.25% అధిక వడ్డీని అందిస్తున్నట్లు వివరించింది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Indian Bank

ఉత్తమ కథలు